“కరోనా” వైరస్ ఎలా వ్యాపిస్తుంది ? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

0
503

“కరోనా వైరస్” ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. చైనాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది సోకిన రోగుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ కడుతున్నారంటే దీని తీవ్రత చైనా ప్రజలపై ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనాలో మొత్తం 45మందికి పైగా ఈవ్యాధి సోకి మరణించారు.

అయితే మనదేశంలో 14మందికి ఈ వ్యాధి సోకినట్టుగా అనుమానంతో వారిపై పరీక్షలు జరుగుతూన్నాయి. కేరళలో 7 మందికి, హైదరాబాద్ లో ఒకరికి, ముంబై, బెంగళూరులో ఇద్దరికీ ఈ వ్యాధి సోకిందని అనుమానంతో టెస్ట్ లు నిర్వచించారు. అయితే వీరిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై లో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని తేలింది. ఈ విషయాన్నీ కేంద్ర ఆరోగ్యశాఖ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రల ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదు కానీ ఈ వైరస్ గాలి ద్వారా ఒకరినుండి ఇంకొకరికి సోకె అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వ్యాధి లక్షణాలు : ఈ వైరస్ సోకినా రోగికి నిత్యం ముక్కు కారుతూనే ఉండటం, గొంతు మంటగా ఉండటం, జ్వరం, తలనొప్పి, దగ్గు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను కలిస్తే మంచిది.

వైరస్ ఎలా వ్యాపిస్తుంది : – ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకినా రోగి తుమ్మినా, దగ్గినా.. పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. రోగిని ముట్టుకున్నా, కరచాలనం చేసినా, ఆ రోగి ముట్టుకున్నా వస్తువులను ముట్టుకున్నా.. ఆ వైరస్ చాలా వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రస్తుతానికి కరోనా వైరస్ కి మందు లేదు. అయితే తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దూరంగా ఉండటం వలన, అంటే వారిని అంటరాని వారిగా చూడటం కాదు, వారు తుమ్మినా, దగ్గినా మీ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తే ఎక్కువ నీళ్లు త్రాగండి. జన సమూహానికి దూరంగా ఉండండి. రెండు, మూడు రోజుల్లో తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.