రేషన్ కార్డు అనేది ప్రభుత్వం జారీ చేసే ఒక స్టాంప్ లేదా కార్డు. ఈ కార్డు పొందిన హక్కుదారునికి యుద్ధకాలంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడిన ఆహారాన్ని లేదా ఇతర వస్తువులను పొందేందుకు పరిమితి మేర అనుమతిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇరువైపుల ఏర్పడిన విరోధాల కారణంగా వస్తువుల యొక్క సాధారణ సరఫరాకు ఏర్పడిన ఆటంకాన్ని నిరోధించేందుకు రేషన్ కార్డులను విస్తృతంగా ఉపయోగించారు.

నిత్యావసర సరకులకు కావల్సిన ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు)ల కోసం దారిద్య్రరేఖకు దిగువనున్న అనేక కుటుంబాలు చాల కాలం నుంచి ఎదురుచూస్తున్నాయి. అయితే అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి మీ సేవ కేంద్రాల్లో నిర్దేశిత ధృవపత్రాలు, ఇతరత్రా వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్కి జతచేయాల్సినవి ఇవే…

ప్రస్తుత నివాసం(సరైన), చిరునామా వివరాలు

*దరఖాస్తుదారు (కుటుంబ యజమాని) గుర్తింపు కార్డు ఓటరు / ఆధార్ కార్డు నకలు / డ్రైవింగ్ లైసెన్స్
కుటుంబ యజమాని పాస్‌పోర్టు సైజ్ పోటో తప్పనిసరి.

*కుటుంబ యజమాని వయస్సు ధ్రువీకరణపత్రం లేదా పాఠశాలలో చదివినప్పటి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి.

*కుటుంబ యజమాని సంవత్సర ఆదాయం, వృత్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం రూ. ఒక లక్ష 60వేలు, పట్టణ ప్రాంత ప్రజల ఆదాయం రూ.2లక్షలకు మించరాదు.


సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న ధృవపత్రాలు, ఇతరాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

*దరఖాస్తులో కుటుంబ సభ్యుల వివరాలను పొందుపర్చాలి.

*నిర్ణీత గడువు లోగా వచ్చిన దరఖాస్తులను స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హత కలిగిన కుటుంబాలకు కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here