చనిపోయిన వారిని మళ్ళి బ్రతికించే పవిత్రమైన హిందు దేవాలయం,ఇది ఎక్కడ ఉంది,దీని చరిత్ర మీఅందరి కోసం..! అందరికి తెలియజేయండి.

0
1301

ఈ విశ్వం లో మనిషి ఏమి చేసిన తన ప్రాణాలను కాపాడుకోవటం కోసమే , ఎన్ని చేసిన ఎదో ఒక రోజు మనిషి ఖచ్చితంగా ప్రాణాలు విడవాల్సిందే అది సృష్టి నియమం. ఎన్ని ప్రయత్నాలు చేసిన చావు నుండి బయటపడలేము. కానీ అదే చావుని కొన్ని నిమిషాలు పాటు అపగల్గితే….. ఏంటి షాక్ లో వున్నారా ,మీరు విన్నది నిజమే, ఏంటి ఇంకా నమ్మలేకపోతున్నారా…. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే వదిలేయండి, మన భారతదేశంలో ఒకటే కాదు ఆశ్చర్యపడే విషయాలు ఎన్నో వున్నాయి అనేది సత్యం. అందులోనూ జీవితంలో ఎప్పుడూ నమ్మలేనటువంటి సంఘటనలు కూడా వుంటాయి.

అటువంటి సంఘటనలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది లఖ్ మండల్. మాకు, మీకు సాధారణంగా తెలీని విషయం ఏమంటే ఆ భగవంతుడు మనుష్యుల ప్రాణాలను ఎప్పుడు ?ఏ విధంగా?తీసుకుంటాడో అతనికి మాత్రమే తెలుసు. అయితే పోయినా ప్రాణం మాత్రం మరలా తిరిగి రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే..అయితే ఈ ఒక్క స్థలంలో మాత్రం పోయిన ప్రాణం కొన్ని నిముషాలపాటు బ్రతికించే శక్తిని కలిగివుందంట. ఇది నిజమో, అబద్ధమో అని మీకు అనిపిస్తూవుంటుంది. అయితే ఈ దేవాలయం ఎక్కడ వుంది? ఆ పుణ్య స్థలం ఏది? ఆ స్థలం యొక్క మహత్యం ఏమిటి?అనే అనేకమైన ప్రశ్నలకు జవాబులను వ్యాసం మూలంగా వివరంగా తెలుసుకొండి.

చనిపోయిన వారిని కొన్ని నిమిషాలపాటు బ్రతికించే ఆ మహిమాన్వితమైన స్థలం ఏది అని ఆలోచిస్తున్నారా?అట్లయితే వినండి ఆ పుణ్యస్థలమే పరమశివుడు వెలసియున్న శక్తివంతమైన దేవాలయం. ఆ దేవాలయం పేరు లఖ్ మండల మందిర్.లఖ్ మండల మందిర్ ఒక పురాతనమైన హిందూ దేవాలయం. మహాశివునికి అర్పితమైన పవిత్రమైన స్థలం. ఈ ఆలయం ఎంతో మహిమ కలదిగా ప్రసిద్ధిచెందింది. ప్రతి మనిషిని అదృష్టం వెంటాడుతుందో లేదో తెలియదుగాని దురదృష్టం ఖచ్చితంగా వెంటాడుతుంది. అందుకోసం ఈ దేవాలయం విశిష్టతలను తెలిసిన ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని సందర్శించి తమ దురదృష్టాన్ని దూరం చేసుకుంటారు..

హిందువులు దేవుళ్ళుగా కొలిచే పాండవులు అజ్ఞాతవాసంలో వున్నప్పుడు కొన్ని రోజులపాటు ఈ స్థలంలో కాలంగడిపారని చెప్పుకొంటారు. పాండవులు కాలిడిన పవిత్రమైన స్థలం ఇది అని చెప్పవచ్చును. లఖ్ మండల్ అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. లఖ్ అంటే “అనేకం” మరియు మండల్ అంటే “దేవాలయం” లేదా “లింగం” అనే అర్థాన్ని కలిగివుంది.ఇక్కడ భారతదేశం యొక్క పురాతత్త్వశాస్త్ర సమీక్షకు సంబంధించిన కళాత్మకమైన కృతులు ఇక్కడ చూడవచ్చును.ఈ దేవాలయం ముఖ్యమైన ఆకర్షణ ఏమంటే అది గ్రానైట్ తో చేయబడిన లింగం. చుట్టుపక్కల ఆ లింగం యొక్క ప్రకాశానికి ఎంతో అందంగా కనపడుతుంది. ఆ లింగాన్ని చూసిన భక్తులు ఎంతో భక్తి భావంతో తన్మయత్వం చెందుతారు.

ఇంతకూ ఈ దేవాలయం ఎక్కడ వుంది అని ఆలోచిస్తున్నారా?అలాగయితే వినండి ఈ మహిమాన్విత దేవాలయం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లాలో జాన్సర్ బవర్ ప్రదేశంలో వుంది.ఈ దేవాలయాన్ని ఉత్తరాఖాండ్ శైలిలో నిర్మించటం జరిగింది.ఈ దేవాలయానికి వెళ్ళే మార్గం ఏమిటంటే ….!లఖ్ మండల మందిర్ చక్రతా నుండి సుమారు 100కిమీ ల దూరం వుంది.రోడ్డు మార్గం ద్వారానైతే మొదటగా ప్రయాణికులు చక్రతాకి వెళ్లి అక్కడి నుండి సులభంగా లఖ్ మండల్ బస్సు లేదా టాక్సీద్వారా చేరవచ్చును. సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుండి లఖ్ మండల్ సుమారు 107కిమీ లు దూరాన వుంది.సమీపంలోని విమానాశ్రయం సు జాలి గ్రాంట్ విమానాశ్రయం.ఇక్కడి నుండి లఖ్ మండల్ కి సుమారు 130కిమీ ల దూరం వుంది.