తన పైన పెట్టిన కేసు వెనక్కి తీసుకోలేదని ఈ హీరోయిన్ కి ఎలా నరకం చూపారో చూడండి

0
1205

అర్ద రాత్రి రోడ్డు పైన ఆడది ఒంటరిగా నడిచినఫ్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని అంటారు. కాని పది మందిలో కూడ ఆడది నిలబడలేని రోజులు ఇవి. అలాంటిది సినిమాల్లో నటించే హీరోయిన్స్ పరిస్తితి ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనక్కర్లేదు. వారి అందాలతో కనువిందు చేస్తే తప్ప సినిమా ను ప్రేక్షకులు ఆదరించరు. నిండుగా చీర కట్టుకొని సినిమాలు తీసే కాలం సావిత్రి జమునల కాలం లోనే పోయింది. ఇప్పుడు ఎంత విప్పితే అంత రెమ్యునరేషన్ అంటున్నారు. పలాన హీరోయిన్ టూ పీస్ వేసింది నువ్వు వేయడానికి అభ్యంతరం ఏంటి అంటు హీరోయిన్స్ ని ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ విదానం చూపిస్తూ ఒకరిని మించి ఒకరు సినిమా స్వరూపాన్ని మార్చేసారు.

ఇలాంటి కోవలోకే వస్తుంది హాట్ హీరోయిన్ స్వేత మీనన్. ఈ పేరు చెప్తే కేరళ రాష్ట్ర యువత కి నిద్ర కూడ పట్టదు. తన హాట్ హాట్ అందాలతో కుర్ర కారు మతులు పోగోట్టింది. ఈమే నటించిన బి గ్రేడ్ మూవి తెలుగులో రతి నిర్వేదం అనే పేరుతో విడుదల అయ్యింది. ఆకాష్ హీరోగా నటించిన ఆనందం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఇమే సినిమాకు పబ్లిసీటి చేయడం కోసం మిగతా హీరోయిన్స్ కన్నా ఒక అడుగు ముందుకేసి కొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది .కాంట్రవర్సిలతో కాపురం చేసే ఈ నటి తన సొంత డెలివరీని షూట్ చేయించుకొని కలిమన్ను అనే సినిమాల్లో పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇవన్ని పక్కన పెడితే ఈమే మరొక వివాదం లో ఇరుక్కుంది. కేరళలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పడవల పందానికి అతిది గా వచ్చిన స్వేతా మీనన్ పైన తప్పు గా నడుచుకున్న కాంగ్రెస్స్ లీడర్ పీతాంబరం కురూపం అనే రాజ్య సభ సభ్యుడి పైన కేసు పెట్టింది. పబ్లిక్ పంక్షన్ లో అసభ్యంగా నడుచుకున్న ఏ ఒక్కరు తనకు అండగా నిలవలేదు సరి కదా తిరిగి తన పైన నే దాడులు చేశారు. అంగబలం అర్ద బలం ముందు తను నిలబడలేకపోయింది. కాంగ్రెస్ లీడర్లు స్వేత మీనన్ పై చివరికి ఇన్ కం టాక్స్ దాడులు జరిపించాడానికి సైతం వెనకాడలేదు. కేసు వెనక్కి తీసుకోవాలంటు పబ్లిక్ గా బెదిరించడం మొదలెట్టారు. చివరికి చేసేదేం లేక పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంది. తనను లొంగదీసుకొవాడానికి తనపై దాడులు చేయించారని స్వేత మీనన్ నెత్తి నోరు బాదుకున్న చట్టన్ని చుట్టంగా చేసుకున్న బడా నేతల పైశాచికత్వానికి లొంగక తప్పలేదు.