నాకు ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువ.. అదే నాకు ఎక్కువ కిక్ ఇస్తుంది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్

0
300

కింగ్ నాగార్జున.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీ అంటేనే అందం, అభినయంతో ఆకట్టుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు టైమ్ నుంచి ఇప్పటి అఖిల్ వరకు.. ఆ ఫ్యామిలీలోని ప్రతి హీరో అందగాడే. అక్కినేని నాగేశ్వరరావు కూడా అప్పట్లో అందగాడే. ఆయనకు ఆ కాలంలోనే మహిళల ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన తర్వాత ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు కూడా మహిళల ఫాలోయింగ్ ఎక్కువ. టాలీవుడ్ కే ఆయన మన్మథుడు. ఆయన వయసు ఇప్పుడు ఆరు పదులు దాటినా కూడా ఇప్పటికీ ఆయన యువకుడిలా కనిపిస్తారు. అలా కనిపించాక.. ఎవరు మాత్రం పడిపోరు చెప్పండి. అందుకే.. టాలీవుడ్ లోనే ఎక్కువ మహిళల ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే.. టక్కున నాగార్జున అని చెప్పొచ్చు.

నాగార్జున తర్వాత మళ్లీ అంతే మహిళల ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు నాగ చైతన్య. అఖిల్ కూడా అంతే. తండ్రికి తగ్గ తనయుల్లా.. తమదైన శైలిలో సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. అయితే.. మహిళల ఫాలోయింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కిక్ ఇస్తుందట.. మన మన్మథుడికి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని నాగార్జున.. ఓ ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పారు.

ఉమెన్ ఫాలోయింగ్ పై మీ అభిప్రాయం ఏంటి?

ఉమెన్ ఫాలోయింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా.. ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం నా అదృష్టం. ఇండస్ట్రీలో నాకు ఎక్కువగా ఉండటం కంటే కూడా.. ఉమెన్ ఫాలోయింగ్ ఉండటం అనేది నాకు ఎక్కువ కిక్ ఇస్తుంది. అదే నాకు ప్లస్ కూడా. నాకు ఇంత అందం వచ్చింది అంటే అది కేవలం నాన్న వల్లనే అంటూ చెప్పుకొచ్చారు కింగ్ నాగార్జున.

నాగ చైతన్యకు కూడా ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువే

అమ్మాయిల ఫాలోయింగ్ కేవలం ఒక్క నాగార్జునకే కాదు.. ఆయన కొడుకు నాగ చైతన్యకు కూడా ఎక్కువే అని తెలుసు కదా. ఆ విషయాన్ని నాగార్జున కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కొడుకుకు కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం తనకు కూడా సంతోషాన్ని కలిగిస్తోందని నాగార్జున చెప్పుకొచ్చారు.

బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా

నేను చదువుకునే రోజుల్లో నాకు యాక్టింగ్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంజినీరింగ్ చేశా. ఆ తర్వాత బిజినెస్ చేయాలనేది నా ప్లాన్. ఫారిన్ లో చదువుకొని వచ్చాక.. బిజినెస్ చేద్దామని అనుకున్నా. ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామనుకున్నా కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఆ సమయంలో ఖాళీగా ఉండలేక నాన్న సినిమాల షూటింగ్ లకు వెళ్లేవాడిని. ఆ సమయంలో అన్న వెంకట్.. సినిమాల్లోకి వెళ్తావా? అని అడిగారు. అప్పుడు నేను నాన్నకు ఆ విషయం చెప్పా. నాన్న కూడా ఓకే చెప్పడంతో.. అలా సినిమాల్లోకి వచ్చేశాను. ఆ తర్వాత కంటిన్యూగా సినిమాల్లో నటించడం, హీరో అవడం.. జరిగిపోయింది.. అని నాగార్జున చెప్పుకొచ్చారు. అలా బిజినెస్ చేయకుండా.. సినిమాల్లోకి వచ్చేశారు నాగార్జున.

అమలకు ముందు నేనే ప్రపోజ్ చేశా

నాగార్జున, అమలది ప్రేమ వివాహం అని అందరికీ తెలుసు కదా. అయితే.. వాళ్ల ప్రేమ పట్టాలెక్కడానికే కనీసం 5 ఏళ్లు పట్టిందట. అయితే.. ముందు అమలకు.. నాగార్జునే ప్రపోజ్ చేశారట. కాకపోతే… తనకు ప్రపోజ్ చేయడానికి 5 ఏళ్లు వెయిట్ చేశారట. అయితే.. నాగార్జున ప్రపోజ్ చేయగానే.. అమల బోరున ఏడ్చేసిందట. ఆ తర్వాత తను కూడా ఒప్పుకుందట. అలా.. అమల, నాగార్జున ఒక్కటయ్యారు అన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here