నాకు బీచ్ లోనే చచ్చిపోవాలని కోరిక.. అందుకే బ్యాంకాక్.. పూరీ షాకింగ్ కామెంట్స్?

0
46

పూరీ జగన్నాథ్.. తెలుగు మాస్ డైరెక్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త సినిమాలను తీసి తన సత్తా చాటారు. తెలుగు సినిమా చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఈ ఎవర్ గ్రీన్ డైరెక్టర్. పూరీ జగన్నాథ్ సినిమా కథలే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన సినిమాల్లోని సీన్లు, సన్నివేశాలు, మాటలు.. అన్నీ చాలా ఘాటుగా ఉంటాయి. మాస్ గా ఉంటాయి. చాలామటుకు ఆయన సినిమాల్లో నిజ జీవితం ఉంటుంది. ఒకప్పుడు వరుస హిట్లతో తెలుగులోనే టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన పూరీ జగన్నాథ్ పర్సనల్ జీవితం గురించి ప్రేక్షకులకు చాలా తక్కువ తెలుసు.

ఆ పూరీ జగన్నాథుడి పేరు పెట్టుకున్న పూరీ జగన్నాథ్ రెండు దశాబ్దాల నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ తెలుసు.. పూరీ జగన్నాథ్ కు బ్యాంకాక్ అంటే ఎంత ఇష్టమో. తను ఏదైనా సినిమా కథ రాయాలన్నా.. బ్యాంకాక్ లోని పట్టాయాకు వెళ్లి అక్కడ బీచ్ లో కూర్చొని కథ రాస్తుంటారు. ఆయనకు బీచ్ అన్నా ప్రాణం.. తనకు టెన్షన్ వచ్చినా.. డిప్రెషన్ లో ఉన్నా.. వెంటనే బీచ్ దగ్గరికి వెళ్తారు.

పూరీ జగన్నాథ్ కు బీచ్ అంటే ఎంత ఇష్టం అంటే.. బీచ్ లోనే చనిపోవాలనేది ఆయన కోరికట. బీచ్ అంటే అంత ఇష్టం అట.. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పూరీ. బీచ్ లో ఉంటే తనను తానే మైమరిచిపోతాడట. పూరీ జగన్నాథ్ తన సినిమాల్లో కూడా ఎక్కువగా బ్యాంకాక్ లో షూటింగ్ చేస్తుంటారు.

ఇడియట్ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రికార్డులు క్రియేట్ చేసిన సినిమా ఇడియట్. ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలను సృష్టించింది. ఆ సినిమాను నిజానికి పవన్ కళ్యాణ్ చేయాల్సింది. ముందు ఆ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించాడట పూరీ జగన్నాథ్. కానీ.. పవన్ కళ్యాణ్ ఆ సినిమాను చేయలేదట. స్టోరీ బాగానే ఉంది అని చెప్పాడట కానీ.. సినిమా చేయడానికి మాత్రం ఒప్పుకోలేదట. అలాగే.. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథలను కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పాడట పూరీ జగన్నాథ్. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సినిమాలేవీ చేయలేదట. దీంతో రవితేజతో ఆ సినిమాలు చేయాల్సి వచ్చిందట.

నేనంటే రామ్ గోపాల్ వర్మకు చాలా ఇష్టం

రామ్ గోపాల్ వర్మకు పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టమట. ఎంత ఇష్టం అంటే.. ఆర్జీవీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఖచ్చితంగా.. ఎక్కువ సమయం పూరీతోనే గడుపుతాడట. ఇద్దరూ కలిసి కాసేపు పిచ్చాపాటీగా మాట్లాడుకుంటారట. పూరీకి కూడా ఆర్జీవీ అంటే అంతే అభిమానం అట. ఇద్దరి మధ్య ఇప్పటికీ ఆ బంధం అలాగే కొనసాగుతోంది.

అమితాబ్ బచ్చన్ కు బిగ్ ఫ్యాన్ ను నేను

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కూడా పూరీ జగన్నాథ్ ఓ సినిమా తీశారు. హిందీలో బుడ్డా అనే సినిమా తీశారు. ఆ సినిమా తీయడానికి.. ఆ సినిమాలో అవకాశం రావడానికి కారణం.. పూరీ జగన్నాథ్.. అమితాబ్ బచ్చన్ కు బిగ్ ఫ్యాన్ అట. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ ను పూరీ ఆరాధిస్తున్నాడట. తను చిన్నగా ఉన్నప్పుడు తన ఇంట్లో అమితాబ్ బచ్చన్ ది పెద్ద ఫోటో కూడా పెట్టుకున్నాడట. తను పెద్ద ఫ్యాన్ అవ్వడం వల్ల.. అమితాబ్ బచ్చన్ తో ఎలాగైనా ఓ సినిమా చేయాలని అనుకొని వెంటనే కథ రెడీ చేసుకొని ఆర్జీవీతో కలిసి అమితాబ్ బచ్చన్ ను కలిశాడట పూరీ. అలా బుడ్డా సినిమా పట్టాలెక్కిందట. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here