నా మొదటి సినిమాలోనే నన్ను మా అన్నయ్య బాగా ఆడుకున్నారు.. నాగబాబు కామెంట్స్?

0
399

నాగబాబు.. మెగా బ్రదర్ అనే బోర్డు మెడలో ఉన్నప్పటికీ.. తన కాళ్ల మీద తాను నిలబడటం కోసం చాలా ప్రయత్నించారు. తెలుగు బుల్లితెర మీద ఆయన తనదైన ముద్ర వేశారు. సినిమా రంగంలోనూ ఆయన రాణించారు. కాకపోతే.. నిర్మాతగా ఆయన సినీరంగంలో చాలా నష్టపోయారు. ఆ తర్వాత తన అన్న మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడంతో నిలదొక్కుకోగలిగారు. అయితే.. నాగబాబు నటనలో అంతగా రాణించలేకపోయినప్పటికీ.. ఆయన బుల్లితెర మీద తనదైన స్కిల్స్ తో బాగా రాణించారు. అలాగే.. యూట్యూబ్ చానెల్ పెట్టి.. తెలుగు సినిమా ప్రేక్షకులకు వినోదం పంచాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు, స్టాండప్ కామెడీ షోలను నిర్వహించిన నాగబాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మెగా బ్రదర్ గానే కాకుండా.. తన టాలెంట్ తో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.

నా మొదటి సినిమా రాక్షసుడు

నా మొదటి సినిమా రాక్షసుడు. అది ప్రముఖ నవలా రచయిత వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా. ఆ సినిమాలో నాకు అన్నయ్య ఒక క్యారెక్టర్ ఇప్పించారు. అందులో సింహం అనే ఓ క్యారెక్టర్ నాతో వేయించారు. అయితే.. అదే నా మొదటి సినిమా. ఆ సినిమా షూటింగ్ సమయంలో మాత్రం నన్ను అన్నయ్య బాగా ఆడుకున్నారు. ఆ సినిమా డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా నాతో బాగా ఆటాడుకున్నారు. ఆ మెమోరీస్ ఇప్పటికీ గుర్తున్నాయి.. అని నాగబాబు చెప్పుకొచ్చారు.

వీరేంద్రనాథ్ లాంటి రచయిత ఇండియాలోనే ఎవ్వరూ లేరు

వీరేంద్రనాథ్ ఎంత గొప్ప రచయితో అందరికీ తెలుసు. వీరేంద్రనాథ్ లాంటి రచయిత ఇండియాలోనే ఎవ్వరూ లేరని.. నాగబాబు అన్నారు. అప్పట్లో వీరేంద్రనాథ్ రాసిన చాలా నవలలను సినిమాలుగా తీశారు. ఆయన ఎక్కువ సినిమాల్లో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించేవారు. తాజాగా దర్శకత్వం వైపు మొగ్గు చూపారు వీరేంద్రనాథ్. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. అయితే.. వీరేంద్రనాథ్ గురించి నాగబాబు మాట్లాడుతూ.. ఆయన లాంటి రచయిత ఇండియాలోనే ఎవ్వరూ లేరని ప్రశంసించారు.

వీరేంద్రనాథ్ పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి.. అవన్నీ నేను చదివాను

నేను పుస్తకాలు ఎక్కువగానే చదువుతాను. కానీ.. వీరేంద్రనాథ్ నవలలు మాత్రం అస్సలు వదలను. ఆయన రాసిన నవలలు అన్నీ చదివాను. మీరు ఇంకా మంచి పుస్తకాలు రాయాలి. తెలుగు ప్రేక్షకులకు అందించాలి అని నాగబాబు కోరారు.

నాగబాబు ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొత్త టాలెంట్ ను బాగా ఎంకరేజ్ చేస్తారు. తెలుగులో సరికొత్త కామెడీని అందించడం కోసం చాలా ప్రయత్నించారు. జబర్దస్త్ కూడా ఆయన ఆలోచనలోనుంచి వచ్చిందే. అలాగే.. తెలుగు ప్రేక్షకులకు స్టాండప్ కామెడీని అందించడం కోసం ఆయన చాలా కృషి చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాగబాబు లాంటి పరిణతి చెందిన నటుడు ఉండటం మంచి పరిణామం.