నిర్భయ కంటే ఘోరం..ఒక అమ్మాయిపై 14 మంది దారుణంగా అత్యాచారం.. స్పృహ కోల్పోయినా వదల్లేదు..భద్రాద్రి జిల్లాలో దారుణం..

0
609

బాలికను హింసించారు.. వేధించారు..నిర్భయ కంటే ఘోరంగా అత్యాచారం చేశారు..అంతేకాదు స్పృహ కోల్పోయినా వదల్లేదు..పైగా జరిగిన ఘోరానికి పెద్దమనుషులు ఆ గిరిజన బాలిక శీలానికి వెలకట్టారు..గిరిజన బాలికపై అత్యాచార ఘటనలో విస్తుపోయే వాస్తవాలు..భద్రాద్రి పోలీసుల అదుపులో నిందితులు..

బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు కాగా.. 14 మందిని అరెస్టు చేశామని భద్రాద్రి జిల్లా మణుగూరు డీఎస్పీ సాయిబాబా తెలిపారు. ఏడూళ్ల బయ్యారం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులు కుంజా ఏసు, పోలెబోయిన భరత్‌, కొట్టెం కిరణ్‌ , వినోద్‌, నవీన్‌ లతో పాటు పోలేబోయిన మహేష్‌, ఎట్టిరాము, పాల్వంచ రాజు, వాడె ప్రవీణ్‌, కుర్సం మురళీ, పాల్వంచ దివాకర్‌, కొట్టెం కన్నారావు, ఎండి గౌస్‌పాషా, మన్నెం సమ్మిరెడ్డిని చూపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సాయిబాబా మాట్లాడారు. పాండురంగాపురం గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక ఆమె తల్లి దండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా.. మధ్యాహ్నం సమయంలో చాక్లెట్లు కొనుక్కనేందుకు దగ్గరలో ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లింది. ఆ బాలికతో మాటలు కలిపిన కుంజా ఏసు, పోలేబోయిన భరత్‌, కిరణ్‌, వినోద్‌ నవీన్‌ కలిసి ఇంటికి తీసుకెళతామని బాలికను నమ్మించి బాలికను ఆటో (టీఎస్‌04, యూబీ 0921)లో ఎక్కించుకున్నారు. జానంపేట రిజర్వు ఫారెస్టు చప్టా ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాలిక స్పృహ కోల్పోగా.. ఏసు, భరత్‌ ఫోన్‌ ద్వారా ఇచ్చిన సమాచారంతో మరో ఎనిమిది మందిని పిలిపించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

స్పృహలేని బాలికను అదే ఆటోలో అమరారం గ్రామంలో బాలిక తాతా అని పిలుచుకునే సమ్మిరెడ్డి వద్ద దింపి ఈ విషయం బయటికి చెప్పొద్దని బెదిరించి వెళ్ళిపోయారు.. కాస్త కోలుకున్న బాలిక విషయాన్ని తాత సమ్మిరెడ్డికి చెప్పింది. సమ్మిరెడ్డి కూడా ఆ బాలికను బలవంతం చేశాడు.

ఉదయం ఆ బాలిక బస్సెక్కి వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో ఉండే తన అన్న ఇంటికి చేరుకుంది. నిరసంగా ఉన్న చెల్లిని గమనించిన సోదరుడు ప్రశ్నించగా.. విషయం చెప్పింది. ఈ లోపు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు మూడు రోజులు అనంతరం ఆమె వాజేడులో ఉందని తెలుసుకున్నారు. అస్వస్థతతో ఉన్న బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో పెద్ద మనుషులు, పార్టీలకు చెందిన నాయకులు కొందరు ఈ విషయాన్ని బయటికి పొక్కనీయవద్దని, పోలీసుస్టేషన్‌కు వెళ్లొద్దని ఇందుకు గానూ రూ.ఐదు లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. వారి మాటలు వినకుండా సదరు బాలిక కుటుంబసభ్యులు తమకు చేసిన ఫిర్యాదు ఆధారంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. తగిన ఆధారాలను సేకరించామని పోలీసులు తెలిపారు..

సంఘటన జరిగిన చప్టా ప్రాంతంలో పెనుగులాడినట్లు, పగిలిన గాజుముక్కలు, చిరిగి చెల్లా చెదురైన చాకెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలికను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించామన్నారు. తమ అన్వేషణలో ఐదుగురు ప్రధాన నిందితులు ఉన్నట్లు తెలిసిందన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here