కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. దానికి కారణం.. ఆయన నటించిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనే సినిమా ఇటీవలే విడుదలై.. విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ కావడంతో కిరణ్.. ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉన్నా.. ఈ సమయంలో ఈ సినిమా రిలీజ్ కావడంతో.. జనాలు థియేటర్ కు వస్తారా? రారా? అనే ఒక సందేహం ఉండేది. కానీ.. సినిమా బాగుంటే.. ప్రేక్షకులు ఎలాగైనా ఆదరిస్తారు.. అనే విషయం మరోసారి రుజువు అయింది.

సినిమాలో కంటెంట్ ఉండాలి.. కానీ.. సునామీ వచ్చినా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తాజాగా అదే జరిగింది. తన సినిమా సూపర్ సక్సెస్ అవడంతో.. కిరణ్ అబ్బవరం.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి, ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ నేనే రాశా

నిజానికి ఏ సినిమా హీరో కూడా కథ రాయడు. కథలు రాసే హీరోలు అరుదుగా ఉన్నారు. అందులో ఒకరే కిరణ్ అబ్బవరం. ఎందుకంటే.. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినమా స్టోరీని, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నింటిని రాసింది కిరణే. కిరణ్ మల్టీ టాలెంటెడ్. అందుకే.. నటనలోనూ ఆయన బాగానే రాణిస్తున్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆయన నటనకు కూడా బాగానే మార్కులు పడ్డాయి.
నా మొదటి సినిమా రాజా వారు రాణీ గారు

ఎస్ఆర్ కళ్యాణ్ మండపం.. కిరణ్ అబ్బవరంకు రెండో సినిమా. ఎందుకంటే.. అంతకు ముందే రాజా వారు రాణీ వారు అనే సినిమాలో హీరోగా నటించాడు. అదే ఆయన మొదటి సినిమా. అయితే.. ఆయన ఇండస్ట్రీలో ఇప్పటికి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని షార్ట్ ఫిలింస్ లో కూడా నటించినప్పటికీ.. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఆడిషన్ ఇవ్వలేదట కిరణ్ అబ్బవరం. ఆయనకు డైరెక్ట్ గా సినిమా అవకాశాలు వచ్చాయట. ఎవ్వరు కూడా ఆడిషన్ తీసుకోలేదని ఇంటర్వ్యూలో తెలిపాడు.
పవన్ కళ్యాణ్ నా ఫేవరేట్ హీరో

కిరణ్ కు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. ఆయన స్మయిల్ అంటే చాలా ఇష్టమట. ఖుషీ, జానీ.. లాంటి సినిమాలంటే చాలా ఇష్టమట. అలాగే.. ఆది, సింహాద్రి సినిమాలన్నా ఇష్టమట. మహేశ్ బాబు ఒక్కడు సినిమా కూడా ఇష్టం అని చెప్పాడు కిరణ్. హీరోయిన్లలో సిమ్రాన్ అంటే ఇష్టమట.

కిరణ్ అబ్బవరం.. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో పాటు.. వానర సైన్యం అనే ఓ షార్ట్ ఫిలింకు కూడా కథ రాశాడట. గచ్చిబౌలి అనే షార్ట్ ఫిలింలో కూడా నటించాడు కిరణ్.

చిన్నప్పటి నుంచి అందరు హీరోల సినిమాలు చూస్తూ పెరిగా. మనకు ఎలాంటి సినిమా అయితే నచ్చుతుంది. ఎలాంటి క్యారెక్టర్ అయితే నచ్చుతుంది. ఎలాంటి సీన్స్ వస్తే విజిల్స్ వేస్తామో.. మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అదే క్లారిటీతో నేను స్టోరీలు రాశాను. అంతే కానీ.. నాకు ఇండస్ట్రీలో ఎటువంటి అనుభవం లేదు. నేను చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలనే ఇన్సిపిరేషన్ గా తీసుకొని వాటినే నా సినిమాల్లో అప్లయి చేస్తా.. అని చెప్పుకొచ్చారు కిరణ్.
ఈ సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్

ఈ సినిమాలో సాయి కుమార్ చేసిన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సాయి కుమార్ ఇప్పటి వరకు తన సినిమా కెరీర్ లో అటువంటి క్యారెక్టర్ చేయలేదు. ఆయనకు కూడా ఈ రోల్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ క్యారెక్టర్ కు ప్రతి ఒక్క తండ్రి, కొడుకు కనెక్ట్ అవుతారు.. అంటూ కిరణ్ చెప్పారు.































