పెళ్లిపీటలు ఎక్కబోతున్న ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరో ?

0
641

ముక్కు అవినాష్ కు ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడి షో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్ట్ నుండి వచ్చిన ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. ఇక ఆ షోలో అవినాష్ చేసిన అల్లరి అంత ఇంతా కాదు.. ఈ క్రమంలో అవినాష్- అరియనా మధ్య నడిచిన ట్రాక్ బాగానే పాపులర్ అయ్యింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటి నుంచి అవినాష్ పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈయనకు పిల్లనెవరూ ఇవ్వరు అంటూ హోస్ట్ నాగార్జున అవినాష్ పై సెటైర్లు కూడా వేసాడు. ఇక తాజాగా అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

తాజగా అవినాష్ పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న ఓక ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ క్రమంలో అందరూ అవినాష్ కు పెళ్లి శుభాకాంక్షలు తెలియచేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వధువు ఎవరు..? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? నీ పెళ్లి నిజంగానే జరుగుతోందా? ఇది షో కోసం చేస్తున్నావా? అంటూ రకరకాల డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ విషయంలో అవినాష్ పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది. మరి ఆ ఫోతో నిజంగా పెళ్లి కోసమా ? ఒక వేళ నిజమే అయితే ఆమ్మాయి ఎవరు ? లేకపొతే ఏదైనా షో లో స్కిట్ కోసమే చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here