భార్య ప్రైవేట్ ఫొటోలను FB లో పోస్ట్ చేసిన భర్త ..లైక్స్ రాకపోవడంతో ఆమెను ఏం చేసాడో తెలిస్తే షాక్

0
1166

పుర్రెకో బుద్ది అంటారు మన పెద్దోల్లు. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు అని అర్థం. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రబుద్దుడు చిత్రంగా ఆలోచించి అబాసుపాలు అయ్యాడు. తనకున్న సోషల్‌ మీడియా పిచ్చితో తన భార్యను దూరం చేసుకోవాలని చూశాడు. కాని అతడికి అక్కడి కోర్టు చివాట్లు పెట్టింది.అయినా కూడా అతడు భార్యతో కలిసి జీవితంచేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత వింత సంఘటనగా ఈ విడాకుల కేసును పరిగణించాలి. ఇప్పుడు ఆ వింత సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన స్టీవ్‌ జార్జ్‌ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలో జాబ్‌ చేస్తున్నాడు. పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అయిన ఆ వ్యక్తి తన భార్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్‌ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆమెకు తెలియకుండా తీసిన ఫొటోలు మరియు ఆమెతో తను కలిసి ఉన్నప్పటి కొన్ని ప్రైవేట్‌ ఫొటోలను కూడా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడం జరిగింది.

దాదాపు 50 ఫొటోలను అతడు షేర్‌ చేశాడు. ఆ ఫొటోస్‌కు మొత్తంగా 2500 లైక్స్‌ రావాలని అతడు కోరుకున్నాడు. ఎందుకంటే అతడు గతంలో ఏ పోస్ట్‌ చేసినా కూడా వెయ్యి అంతకు మించి లైక్స్‌ వచ్చేవి. తన భార్య ప్రైవేట్‌ ఫొటోలకు అంతకు మించి లైక్స్‌ రావాలని అప్పుడే ఆమె తనకు సూట్‌ అని భావించాడు.ఆ ఫొటోలు పోస్ట్‌ చేసి వారం రోజు గడుస్తున్నా కూడా 500 లైక్స్‌కు మించలేదు. దాంతో ఫేస్‌బుక్‌లోని తన స్నేహితులకు తన భార్య నచ్చలేదని, ఆమెకు అంత అందం లేదని, ఆమెకు మంచి ఫిజిక్‌ కూడా లేదని వారు అభిప్రాయ పడుతున్నట్లుగా స్టీవ్‌ భావించాడు.

తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఉన్న స్నేహితులు అంతా కూడా ఆమెను తిరష్కరించారు. అంతమంది తిరష్కరించిన ఆమెతో నేను ఎలా సంసారం చేయాలని అతడు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా పిల్లలు కాలేదు కనుక ఆమెను వదిలించుకుని ఈసారి మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.అదే విషయాన్ని ఆమెకు చెప్పగా విడాకులు ఇచ్చేందుకు నో చెప్పింది. దాంతో అతడు కోర్టును ఆశ్రయించి, తన భార్య అందంగా లేదని, పెళ్లి అప్పుడు అందంగా కనిపించి నన్ను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదని, సమాజంలో నా పరువు పోతుంది అంటూ కోర్టుకు చెప్పాడు.

ఫేస్‌బుక్‌లో తన భార్య ప్రైవేట్‌ ఫొటోలు పెట్టినా కూడా ఎక్కువ లైక్స్‌ రాలేదని, అందుకే ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అతడి మాటలకు కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెళ్లి సమయంలో ఆమె ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని వివాహంనాటి ఫొటోలను చూసి నిర్ధారణకు వచ్చారు.మెపై మోజు తీరిన తర్వాత ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నావు అంటూ స్వీవ్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజురు చేసేందుకు నిరాకరించింది. కోర్టు విడాకులు ఇవ్వకున్నా కూడా తన భార్యతో మాత్రం కలిసి ఉండలేను అంటూ ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

అతడి మానసిక పరిస్థితి బాగాలేదని కొందరు అంటున్నారు. స్టీవ్‌ భార్య మాత్రం అతడు మారుతాడని ఎదురు చూస్తుంది. ఇలాంటి ప్రబుద్దులు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంది కదా..!