మన విధ్య శాఖ మంత్రిగారి కొత్త సూత్రం: (-) + (-) = ఎంతో తెలుసా..తెలిస్తే మంత్రి పరువు గోవిందా …!వైరల్ వీడియో

0
1001

సందర్భం దొరికితే చాలు.. ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చేయాలని, అభాసుపాలు చేయాలని చూస్తుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఆ సమయంలో వాళ్లు చేసే పొరపాటుతో… నవ్వుల పాలవుతుంటారు. ఉత్తరాఖండ్ లో సరిగ్గా ఇదే జరిగింది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అరవింద్ పాండే… ప్రభుత్వ విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా రాజధాని డెహ్రాడూన్ లోని మహిళా ఇంటర్ కాలేజ్ కు వెళ్లారు. అక్కడ ఓ క్లాసులోకి వెళ్లారు. అప్పుడు అక్కడ సైన్స్ క్లాస్ జరుగుతోంది. అందరినీ నిశ్శబ్దంగా ఉండమన్న ఆయన.. మైనస్ ప్లస్ మైనస్ ఎంతవుతుందని క్లాస్ టీచర్ ని అడిగారు. అప్పుడు మైనస్ అని ఆన్సర్ ఇచ్చింది టీచర్. వెంటనే ఆగ్రహించిన ఆయన.. ప్లస్ అవుతుందన్నారు. నేను కూడా సైన్స్ చదివా అంటూ టీచర్ ను గదమాయించారు. మహిళవు కాబట్టి ఏం అనటం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న అధికారి.. మంత్రిగారిది తప్పని తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి.

అరవింద్ పాండే అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నెటిజన్లు ఆయన్ను ఒక ఆట ఆడుకున్నారు. ఇంత జరిగినా… ఆయనలో మార్పు రాలేదు. టీచర్లను అవమాన పరచాలనే భావన తనకు లేదని.. ‘కీ’ పుస్తకాలు పట్టుకుని చెబుతున్నారని.. దాన్నే తప్పుపడుతున్నా అన్నారు. ఇప్పటికి కూడా మైనస్ ప్లస్ మైనస్.. ప్లస్ అవుతుందని గట్టిగానే చెబుతున్నారు. వాస్తవంగా ఆన్సర్ టీచర్ చెప్పిందే కరెక్ట్.