యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ కు ఈ వివాదాలు తప్పడంలేదు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి పెద్దరచ్చే అయింది. తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఒక టీవీ షోలో అమరావతి రాజధాని విశాఖ అంటూ యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే యాంకర్ ప్రదీప్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని, ఆపై రైతులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.

డాక్టర్ కావాల్సిన వేరోనికా ఎలా మంచు వారింటికి పెద్ద కోడలయ్యింది. – Read More..
ఈ క్రమలో ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్లో తిరగనివ్వమని, యాంకర్ ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విషయం కోర్టులో ఉందని. అసలు కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్ మాట్లాడటం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

































