మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణును పెళ్లి చేసుకున్న వేరోనికా బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. వెరోనికా సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సోదరి అవుతుంది. వైఎస్ రాజారెడ్డి కుటుంభంలో చిన్నమనవరాలు. వైఎస్ రాజ రెడ్డి నాలుగో కుమారుడు సుధాకర్ రెడ్డి కుమార్తె అన్నమాట. అంటే స్వయానా రాజశేఖర్ రెడ్డికి వెరోనికా కూతురు వరస అవుతుంది. వెరోనికా తల్లి విద్యా రెడ్డి. తల్లి తండ్రులు ఇద్దరు కూడా వ్యాపారవేత్తలు. వెరోనికా అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నది. ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కూడా కనేది. పాఠశాలలో ఉన్నప్పుడు అమెరికా లోని ఒక ఆసుపత్రిలో వాలంటీర్ గా సేవలు చేయడం కోసం తన స్నేహితులతో కలిసి వెళ్లిన విరోనికా అక్కడ శవాలను చూసి తట్టుకోలేక పోయింది. అందుకే డాక్టర్ కావాలనుకున్న ఆశయాన్ని అప్పుడే వదిలేసింది.

సెలవులకు తాత సిసి రెడ్డీతో గడిపేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేదట. తాతతో తన ఆశలు, ఆశయాలు సిసిరెడ్డి కి చెప్పి ఆయన సలహాలు, అనుభవం నేర్పిన పాఠాలు నేర్చుకునేదట. సిసి రెడ్డి తనలో ఎంతో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపాడానీ ఆమె తన సన్నిహితులతో చెబుతోందట. తాత చనిపోయినప్పుడు ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఆమెకున్న అనుబంధం అలాంటిది. పెదనాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా వెరోనిక ను తన కూతురు షర్మిల లాగే ఆదరించేవారట. వెరోనికా తన చేయబోయే పనుల గూర్చి చెబుతుంటే ఆయన ఎంతో ఆసక్తిగా సలహాలు కూడా ఇచ్చేవారట. అలాగే వెరోనికాకు తండ్రి తరుపున రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉంటే, అమ్మ తరుపున సినీ వ్యాపార బ్యాక్ గ్రౌండ్ ఉంది. రాజకీయ నేపథ్యంలో నుంచి వచ్చిన వెరోనికా సినీ నేపథ్యం నుంచి వచ్చిన మంచు వారి అబ్బాయి మంచు విష్ణుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మంచు విష్ణు నటించిన ఢీ సినిమాకు వెరోనికా కాస్టూమ్ డిజైనర్ గా పని చేసింది. ఈ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. హీరో విష్ణు మాట తీరు, నడవడికలు, మంచితనం చూసి ఆమె ఇష్టపడిందట. అలాగే వెరోనికా మంచితనాన్ని చూసి కూడా మంచు విష్ణు మనసు పారేసుకున్నాడట. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా మంచు విష్ణు ఫ్యామిలీ చాలా మంచిదని వెంటనే పెళ్ళికి అంగీకరించారట.

వైస్సార్ ఫ్యామిలీ తో పెళ్లి ప్రస్తావన రాగానే మోహన్ బాబు కూడా కాదనలేకపోయాడు. అందులోను కొడుకు ఇష్టపడిన అమ్మాయి అవ్వడంతో మోహన్ బాబు కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయాడు. అలా అతిరథ మహారథుల సమక్షంలో మంచు విష్ణు, వెరోనికా పెళ్లి అట్టహాసంగా జరిగింది హీరో మంచు విష్ణు వివాహం వెరోనికా రెడ్డితో మార్చి 1, 2009న జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్ళికి తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు అంతా వచ్చారు. అందరికీ తలలో నాలుకలా మారిపోయిన వెరోనికా ప్రస్తుతం న్యూయార్క్ స్కూల్ నిర్వహిస్తోంది మంచు ఫ్యామిలీ ఇప్పటికే శ్రీ విద్యానికేతన్ పేరుతో స్కూల్స్, కాలేజెస్ స్థాపించారు. మంచు విష్ణు, ఆయన సోదరుడు కూడా అక్కడే చదువుకున్నారు. ఆయనప్పటికీ వెరోనికా మరొక స్కూల్ ను స్థాపించినది. అమెరికాలో తను చదువుకున్న విద్యను తెలుగు ఇక్కడి విద్యార్థులు కూడా చదువుకోవాలన్నా ఉద్దేశంతో ఈ పాఠశాల పెట్టిందట.

మంచు విష్ణు వెరోనికాల జంటకు ఇద్దరు కవల పిల్లలు. వీరు డిసెంబర్ 2011 లో జన్మించారు. వారి పేరు అరియనా, విరియానా. ఇలా ఇద్దరి పిల్లలకు జన్మ నివ్వడంతో విష్ణు ఆ సమయంలో చాలా భావోద్వేగానికి గురయ్యాడట. వెరోనికాతో గడిపిన ప్రతి క్షణం నాకు ప్రత్యేకమే. ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన రోజు మాత్రం నా జీవితంలో మరిచిపోలేనిది అని తెలిపారు. అయితే భర్త ప్రోత్సహంతోనే అటు కుటుంబపరంగా, ఇటు వ్యాపారపరంగా ముందుకు వెళ్లగలుగుతున్నా అని అంటుంది వెరోనికా. అయితే గతంలో ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కాగా, మళ్ళీ వీరికి ఒక బాబు అలాగే మరొక పాప కూడా పుట్టారు. అంటే విష్ణు, వెరోనికా దంపతులకు మొత్తంగా నలుగురు సంతానం అన్నమాట.

































