మహిళకు ఒకేసారి రెండు డోసుల టీకా..!నర్సు పొరపాటు..

0
68

ఒకేసారి రెండు డోసుల క‌రోనా టీకా వేసిన ఘ‌ట‌న తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబ‌ర్‌పేట్ జ‌డ్పీ హైస్కూల్‌లో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈనేపధ్యంలో ల‌క్ష్మీప్ర‌స‌న్న అనే మ‌హిళకు న‌ర్సు పొరపాటున రెండు డోసులు వ్యాక్సిన్ వేసింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘ‌ట‌న కాస్త ఆల‌స్యంగా వెలుగు లోకి వ‌చ్చింది.

కాగా.. ఆ మహిళ అప్పటికే మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకుంది. మొద‌టి డోసు వేసుకున్న మ‌హిళ‌ను గ‌మ‌నించని న‌ర్సు.. పొరపాటున వేరే మ‌హిళ వ‌చ్చింద‌నుకొని రెండో డోసు కూడా వేసిన‌ట్లు తెలుస్తోంది. రెండు వ్యాక్సిన్స్ వేసుకున్న ల‌క్ష్మిప్ర‌స‌న్న‌ను వైద్య సిబ్బంది వ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు రోజుల ప‌రిశీల‌న అనంత‌రం ఈ ఉద‌యం ఆమెను డిశ్ఛార్జి చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here