ఫేస్ బుక్ ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైంది. బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో వ్యక్తిగత రిలేషన్ మెయింటెయిన్ చేసేటంతటి టైం బిజీ లైఫ్ కారణంగా దొరకడంలేదు. అందుకే మనకు సంబంధించిన ఎటువంటి విశేషమయినా, ఇంకా ఏదయినా ఎఫ్బీ వాల్ మీద పోస్టు చేస్తే సరి సెకన్లలో ప్రపంచానికి చేరిపోతోంది. అందుకే మన వ్యక్తిగత విషయాల సమాహారంగా ఫేస్ బుక్ మారిపోయింది. అంతటి ప్రాధాన్యత కలిగిన అకౌంట్ను మనకు సంబంధంలేని వ్యక్తులు, మన మీద కన్నేసి ఉంచిన వారు చూడడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మన ప్రొఫైల్ ని ఎవరు పడితే వారు ఓపెన్ చేసి ఏమేం పోస్టు చేశారో తెలుసుకునే సదుపాయం ఉండడం ప్రైవసీకి ప్రమాదకరమే. ఇక ఆకతాయిలు అమ్మాయిల ప్రొఫైల్స్ ఓపెన్ చేసి అందగా ఉన్న వారి ఇమేజ్ లు సేవ్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని దుర్వినియోగం చేయడం తెలిసిందే. కొంతమంది వాటిని మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా మనం రోజూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అయితే మన ప్రొఫైల్ ను ఎవరు ఎవరూ ఓపెన్ చేశారో తెలుసుకోవచ్చు ఇలా..

టైంలైన్ పై రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్(VIEW PAGE SOURCE) సెలక్ట్ చేయాలి. వెంటనే ఓ కోడింగ్ ఉన్న పేజీ తెరుచుకుంటుంది. జస్ట్ ఆ పేజీలో కంట్రోల్ ఎఫ్ నొక్కండి(CTRL+F) ఆ తర్వాత ఇన్షియల్ చాట్ ఫ్రెండ్స్ లిస్టు (InitialChatfriendsList) అని టైపు చేసి సెర్చ్ కొట్టాలి. ఆ కోడింగ్ పేజీలో ఈ అక్షరాలు సెలక్ట్ అయ్యాక యూజర్ ఐడీలు కనిపిస్తాయి. వెంటనే ఆ ఐడీలు కాపీచేసి ఫేస్ బుక్ లో సెర్చ్ చేసినా లేదా www.facebook.com/ తర్వాత యూజర్ ఐడీని నొక్కినా మీకు ఎవరెవరు మీ ఫేస్ బుక్ అకౌంట్ ని చూశారో తెలిసిపోతుంది. ఇక్కడ చెప్పిన అంశాలను దృశ్య రూపంలో మరింత వివరణాత్మకంగా తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here