Vivo v30: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలోనే మంచి మంచి ఫీచర్స్ కలిగిన కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది వివో సంస్థ. వివో వీ 30 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ కూడా లాంచ్ చేయనున్నారు.

మరి తాజాగా విడుదల అయినా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్ ను అందించారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 12 జీబీ ర్యామ్ తో రానుంది. ఇక ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన 3డీ కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ మనకు బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా వంటి కలర్స్ లో లభించనుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ లో 6,78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ను ఇవ్వనున్నారు. 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ను అందించారు.
ఫీచర్ల విషయానికొస్తే..
డీసీఐ పీ3 కలర్ ఆప్షన్ 100 శాతం కవరేజీతో పాటు 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ను ఈ ఫోన్ అందిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ +128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ర్యామ్ వంటి స్టోరేజ్ వేరియంట్స్ లో తీసుకొచ్చారు. అంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకు మొత్తం గా నాలుగు వేరియంట్స్ లో లభించనుంది. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. వివో వి30 స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ ఆరా లైట్ రియర్ కెమెరా సెటప్ ను అందించారు. 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50 ఈ సెన్సార్ ను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు.































