ఏపీ రాజధాని తరలింపు విషయంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఇప్పుడు ఢిల్లీ కి చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ అమరావతి రైతులు, రాజధాని జెఎసి నేతలు ఈరోజు ఢిల్లీ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసి విన్నవించుకున్నారు. అంతేకాదు ఆందోళనకారులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందని, వారిపై అక్రమ కేసులు పెడుతుందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి అని కిషన్ రెడ్డిని కోరారు రాజధాని జేఏసీ నేతలు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటు వంటి సమాచారం లేదని, కేంద్రప్రభుత్వానికి సమాచారం అందితే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. రాజ్యాంగ పరిధిలోనే కేంద్ర వ్యవహరిస్తుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ, రాజధాని తరలింపు మంచిది కాదని, అయితే అది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయం అన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రం చేస్తామని చెప్పారు. మూడు రాజధానులు మంచిది కాదని బీజేపీ ఇంతకుముందే చెప్పిందని చెప్పారు కిషన్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here