రజనీ నటించిన తొలి హాలీవుడ్ ఏంటో తెలుసా.. డబ్బింగ్ కూడా చెప్పారు..

0
1254

రజనీకాంత్ గురించి.. ఆయన నటన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన ఆయన.. తన కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాలు చేశాడు. నాలుగున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో ఓ అమెరికన్ సినిమాలోనూ ఆయన నటించారు. అంతేకాదు.. ఆ సినిమాలోని తన క్యారెక్టర్ కు తనే డబ్బింగ్ కూడా చెప్పుకోవడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ కథ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పలు హాలీవుడ్ సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ అశోక్ అమృత‌రాజ్. భారతీయుడైన ఇతడు నిర్మించిన సినిమాయే బ్లడ్ స్టోన్. 1988లో ఈ సినిమా తెరకెక్కింది. డ్వైట్ హెచ్‌. లిటిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఓ సౌత్ నటుడు నటించడం.. అందులోనూ కీరోల్ పోషించడం అప్పట్లో సంచలనం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సైతం ఎక్కువ భాగం మైసూరు, బెంగళూరు, మదువలై సహా పలు ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలలో రజనీకాంత్ శ్యామ్ సబు అనే ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ చేశారు. బ్లడ్ స్టోన్ అనే వజ్రం విదేశం నుంచి మన దేశానికి వస్తుంది. అది రజనీ ట్యాక్స్ లోకి చేరుతుంది. అనంతరం తన చేతికి చిక్కుతుంది. ఈ వజ్రం హీరోయిన్ దగ్గరుందని భావించి విలన్లు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమె కోసం హీరో బ్రెట్ స్టిమ్‌లీ ఇండియాకు వ‌స్తాడు. ర‌జ‌నీ, అత‌డు ఫ్రెండ్స్ అవుతారు. బ్లడ్ స్టోన్ ను ఎలా కాపాడుతారు.. అనేది సినిమా స్టోరీ.

ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు రజనీ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. నిజానికి తనకు ఇంగ్లీష్ గ్రామర్ కు తగ్గట్లు మాట్లాడలేరు. కానీ ప్రొడ్యూసర్స్ ఆయనకు ఓ ట్యూటర్ ను పెట్టించి, దైర్యం చెప్పి ఇంగ్లీష్ మాట్లాడేలా చేశారు. చివరకు ఆయన క్యారెక్టర్ ఆయనే డైలాగులు చెప్పేలా చేశారు. ఆ తర్వాతే రజనీ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడ్డం నేర్చుకున్నారు. ర‌జ‌నీ చెప్పిన‌ డైలాగ్స్‌, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ హీరో బ్రెట్ స్టిమ్‌లీ, స్టోరీ రైట‌ర్ నికో మాస్టోరాకిస్‌ కు బాగా నచ్చాయి. తనను ఆ ఇద్దరు బాగా మెచ్చుకున్నారు. ఈ సినిమా 1988 అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా అంతగొప్పగా ఆడలేదు. ఇండియాలో మాత్రం బాగానే ఆడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here