రవితేజ తో కలిసి ఈ అమ్మాయి “గున్న గున్న మామిడి” పాటకు చేసిన డాన్స్ చూస్తే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే..!

0
1486

వరుస ప్లాపులతో కాస్త వెనక పడ్డ రవితేజ, ‘బెంగాల్ టైగర్’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసకున్నాడు. రొటీన్ సినిమాలు చేస్తే నిలదొక్కుకోవడం కష్టమని ఊహించి అనిల్ రావిపూడి చెప్పిన విభిన్నమైన స్టోరీకి కమిట్మెంట్ ఇచ్చి ‘రాజా ది గ్రేట్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

అంధుడిగా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుని పాత్రలో కనిపించాడు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు…. ఆ నయనాల్లేకుండానే పాతికేళ్ల నుండి కుమ్మేత్తున్నాం ఇక్కడ… మిగతా పార్ట్స్ అమ్మేసుకుంటారా? సర్వేంద్రియానం సర్వం ప్రధానం’ అంటూ రవితజ చెప్పే డైలాగ్ సినిమాలో హైలెట్ గా నిలిచింది..

రవితేజ న్యూ లుక్ లుక్ పరంగా కూడా రవితేజ చాలా మారిపోయాడు. ‘బెంగాల్ టైగర్’ సినిమాకు రవితేజ లుక్ విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా ‘రాజా దిగ్రేట్’ సినిమాలోనూ రవితేజ సన్నగానే ఉన్నప్పటికీ లుక్ పరంగా సూపర్బ్ అనేలా ఉన్నాడు.

డైలాగ్స్ అదుర్స్ సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ” నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేక పోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది ఈ ప్రపంచం చూడాలి” అంటూ నటి రాధిక చెప్పిన డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

రాజా దిగ్రేట్ ఈ చిత్రంలో రవితేజ పేరు ‘రాజా ది గ్రేట్’…. వెల్ కం టు మై వరల్డ్ అంటూ రవితేజ తన అభిమానులను ఈ సినిమాకు ఆహ్వానిస్తున్నాడు. గుడ్డి వాడు తనకు ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించారు.

గున్న గున్న మామిడి సాంగ్ మాములుగా వింటేనే కుర్రోళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది థియేటర్ లో ప్లే అవుతుంటే ఇక జాతరే జాతర. దీనికి తోడు మన మాస్ మహారాజ డాన్స్. ఇక అభిమానులంతా నేల మీద ఉండగలరా.? అత్తారింటికి దారేదిలో కాటమ రాయుడు చిత్రీకరించిన విధంగా “రాజా ది గ్రేట్” లో “గున్న గున్న మామిడి” సాంగ్ చిత్రీకరించారు.

ఇది ఇలా ఉండగా..ఇటీవల ఓ కాలేజీ లో జరిగిన “రాజా ది గ్రేట్” సక్సెస్ మీట్ లో ఓ కాలేజీ అమ్మాయితో కలిసి “రవితేజ” గున్న గున్న మామిడి సాంగ్ కి డాన్స్ చేసి అందరిని ఉత్సాహపరిచాడు చూడండి!