కమల్ హాసన్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. ఈ జోడీ నటించిన ఎన్నో సినిమాలు జనాల మనసులను దోచాయి. వీరిద్దరి సినిమాలు అంటేనే జనాల్లో ఏదో తెలియని ప్రత్యేక అభిమానం ఉండేది. వీరిద్దరు కలిసి నటించిన వసంత కోకిల, ఆకలి రాజ్యం, ఒకరాధ ఇద్దరు కృష్ణులు సినిమాలో వీరి నటనకు జనాలు బ్రహ్మరథం పట్టారు. తెలుగు తమిళంలోనే కాదు.. హిందీలోనూ వీరిద్దరు కలిసి నటించారు. సద్మా సినిమాలో నటించి సక్సెస్ అయ్యారు. వీరి ఆన్ స్ర్కీన్ నటనను మెచ్చుకున్న జనాలు.. నిజ జీవితంలోనూ ఒక్కటైతే బాగుటుంది అనుకున్నారు. అంతేకాదు.. శ్రీదేవి ఫ్యామిలీతో కమల్ హాసన్ మరింత దగ్గరగా మెలిగే వారు.

ఒకానొక సమయంలో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి కమల్ ను అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ వెల్లడించారు. శ్రీదేవి చనిపోయాక.. జరిపిన ఓ సభలో ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. శ్రీదేవి 28 అవతారాలు అనే పేరుతో ఓ నోట్ రిలీజ్ చేశారు. అందులో పలు ఆసక్తికర విషయాలు వివరించారు. శ్రీదేవి.. కమల్ సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె తల్లి అనుకుందంట. అందుకే ఓరోజు తన బిడ్డను వివాహం చేసుకోవాలని కోరిందట. కానీ ఆమె ప్రపోజల్ ను కమల్ సున్నితంగా తిరస్కరించారట. ఎందుకంటే శ్రీదేవిని తను సిస్టర్ లా భావించే వారట. అందుకే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదట.

వెండితెరపై శ్రీదేవితో పలు లవ్ మూవీస్ చేయడం మూలంగా అభిమానులు నిజ జీవితంలోనే అలాంటి సంబంధమే ఉంటుందని భావించేవారని కమల్ చెప్పారు. కానీ అదంతా అవాస్తవం అన్నారు. అయితే తమపై వచ్చే రూమర్స్ ను ఎప్పటికప్పుడు ఖండించే వాడినన్నారు. తానంటే శ్రీదేవికి చాలా గౌరవం అని చెప్పారు. తను చనిపోయే వరకు కమల్ ను సర్ అని పిలిచేదని చెప్పారు. దీన్ని బట్టి కమల్, శ్రీదేవి మధ్య ఉన్న సంబంధం ఎంత పవిత్రమైనదో అని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సినిమాల్లో రొమాన్స్ చేసినా.. నిజ జీవితంలో మంచి మిత్రులుగా ఉండేవారు కమల్, శ్రీదేవి.































