సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకోవడంలో తప్పయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం ఇక్కడ అవకాశం రావడం కోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది అవకాశం వచ్చి సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందిన వారు మాత్రం వాళ్ల ఇమేజ్ ని ఇంకా పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. అందులో భాగంగా ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అబ్బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో అబ్బాస్ కి మంచి పేరు గుర్తింపు లభించింది. ప్రేమ దేశం సినిమాలో వినీత్, అబ్బాస్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇద్దరికీ సమానమైన క్రేజ్ వచ్చినప్పటికీ అబ్బాస్ కి మాత్రం వినీత్ కంటే కొంచెం ఎక్కువగానే క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాతనే అబ్బాస్ కటింగ్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఒక స్టార్ హీరోకి సైతం లేనంత మంది అభిమానులు అబ్బాస్ కి ఉండేవారు. అలా రోజు ఇంటికి చాలామంది అభిమానులు అబ్బాస్ ని చూడడానికి వస్తూ ఉండేవారు. ప్రొడ్యూసర్లు దర్శకులు అయితే అబ్బాస్ తో సినిమా చేయడానికి ఇంటికి వస్తు ఉండేవారు.

ప్రేమదేశం సినిమా హిట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల పాటు ఖాళీ లేకుండా అబ్బాస్ స్టోరీ కూడా వినకుండా ఎడాపెడా సినిమాలు ఒప్పుకున్నాడు. దాంతో తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పటినుంచి ఆయన క్రేజ్ అనేది నిదానంగా పడిపోతూ వచ్చింది. అలా ఇండస్ట్రీలో అబ్బాస్ ఎంత తొందరగా పైకి ఎదిగాడో ఆ తర్వాత అంతే తొందరగా కింద పడిపోవడం జరుగుతూ వచ్చింది. ఆయన చేసిన తప్పు ఏమిటి అంటే మంచి స్టోరీ లని ఉంచుకోకపోవడం అడ్వాన్స్ తీసుకుని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే కెరియర్ అనేది ఇలాగే అవుతుందని అబ్బాస్ ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రేమదేశం సినిమా సక్సెస్ అయిన తర్వాత సౌత్ లో టాప్ దర్శకుడిగా గుర్తింపు పొందిన శంకర్ దర్శకత్వంలో ‘జీన్స్’ సినిమా చేసే అవకాశం మొదటగా అబ్బాస్ కి వచ్చింది. అప్పటికీ అబ్బాస్ పలు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల జీన్స్ సినిమా చేయలేకపోయాడు.

తన కోసం శంకర్ 2 నెలలు వెయిట్ కూడా చేశాడు. అయినప్పటికీ అబ్బాస్ కి ఇంతకుముందు కమిట్మెంట్స్ ఉండడం వలన ఆ సినిమా చేయలేకపోయాడు. ఆ అవకాశం ప్రశాంత్ కి దక్కింది జీన్స్ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీ లో మంచి హిట్ గా నిలిచింది. ఇలా ఏ సినిమా పడితే ఆ సినిమా కమిట్ అవ్వడం వల్ల మంచి సినిమాలను వదిలేసి ఫ్లాప్ సినిమాలు చేయడం జరిగింది. దాంతో ఆయన కెరియర్ ని చేతులారా ఆయనే నాశనం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ అబ్బాస్ కి పెద్దగా సక్సెస్ అయితే రాలేదు. ప్రేమ దేశం అప్పుడు ఎంత క్రేజ్ ఉండేది ఆ తరువాత తగ్గుతూ వచ్చింది.

ఇప్పుడు అబ్బాస్ న్యూజిలాండ్ లో ఉంటున్నాడు. అయితే న్యూజిలాండ్ వెళ్లిన మొదట్లో కొన్ని రోజుల పాటు అక్కడే ఒక పెట్రోల్ బంకులో పని చేశాడు. ఆ తర్వాత ఒక కంపెనీలో జాబ్ చూసుకొని ప్రస్తుతం జాబ్ చేసుకుంటూ తన ఫ్యామిలీతో హ్యాపీ గా లైఫ్ ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసిన ఒక స్టార్ హీరో అవకాశాల్లేక న్యూజిలాండ్ జాబ్ చేసుకోవడం అనేది నిజంగా అబ్బాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులకు కూడా ఒకరకంగా బాధను కలిగించే విషయం అనే చెప్పాలి. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో నరసింహ అనే సినిమాలో కూడా నటించాడు అబ్బాస్…



































