నాగచైతన్య నటించిన “బెజవాడ” చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమలా పాల్, రామ్ చరణ్ తో నాయక్ సినిమాతో మంచి విజయం సాధించి, అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలు సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించింది. అయితే తరువాత పెద్దగా తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. కానీ తమిళ, మాలయాళ భాషల్లో మాత్రం వరుసగ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇకపోతే దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకోవడం, తదుపరి విడాకులు తీసుకోవడం, వెనువెంటనే ఆమె తమిళ సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా మారిపోయారు.
అయితే అమలాపాల్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. అమలా పాల్ తండి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించడంతో చెన్నై లో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అమలా పాల్ హుటాహుటిన చెన్నై నుంచి కేరళ వెళ్ళారు. కేరళలో ఈరోజు వర్గీస్ పాల్ అంత్యక్రియలు జరగబోతున్నాయి.



























