వెంకీ, రెడీ, ఢీ, బిందాస్, మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మాస్టర్ భరత్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. చిట్టినాయుడుగా తన అద్భుత నటనను ప్రదర్శించిన మాస్టర్ భరత్. పెద్దవాడయ్యాక అల్లు శిరీష్ నటించిన ABCD చిత్రంలో సెకండ్ హీరోగా నటించాడు. ఈ విషయం అందరికి తెలిసందే. ప్రస్తుతం సాగర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చినా ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కుడికన్ను కనిపించదు అంటూ షాకింగ్ విషయాన్నీ బయటపెట్టాడు.
ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భరత్ మాట్లాడుతూ “తనకి ఊహ తేలినప్పటి నుండి సినిమాలలో నటిస్తూనే ఉన్నాడని, మూడేళ్ళ వయస్సు నుండి ఒకవైపు సినిమాలు చేస్తూనే మెడిసిన్ పూర్తీ చేసాడని. ప్రస్తుతం మెడిసిన్ లోనే డాక్టరేట్ చేతున్నాడని. చైల్డ్ ఆర్టిస్టు నుండి ఇప్పుడు పెద్దవాడిని అయ్యా అంటున్నాడు. స్కూల్, కాలేజ్ అంతా అయిపోయింది కానీ నేను ఇంకా అమ్మచాటు బిడ్దనే అంటున్నాడు భరత్, లవ్ లాంటివి ఏమి లేవు కానీ ప్రపోజ్ లు మాత్రం బాగానే వచ్చేవని చెప్పాడు.
తాను చెన్నై లో కాలేజీలో జాయిన్ అయినపుడు బాగా సన్నబడ్డాడట దానికి కారణం ఆ సందర్భంలో తనకి జరిగిన మేజర్ ఆక్సిడెంట్ అని. తన కన్నుకి పెద్ద దెబ్బ తగిలిందని, కళ్లజోడుతోనే ఎప్పుడు తిరిగేవాడినని తన లైఫ్ లో జరిగిన ఆక్సిడెంట్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు భరత్. తాను వర్కవుట్ చేస్తున్నప్పుడు రాడ్ లో ఉండే స్ప్రింగ్ వచ్చి కన్నుకి గట్టిగ తగలటం వల్ల కన్ను బాగా దెబ్బతిందట. డాక్టరు దగ్గరకి వెళ్ళేసరికే కుడి కన్ను కనిపించడం మానేసిందట. మెడిసిన్ ఇస్తే కవర్ అవ్వొచ్చు అని చెప్పారట డాక్టర్. కానీ ఇప్పటికీ తనకి ఆ ఇబ్బంది ఉందని చెప్పాడు భరత్.
తన కాలేజీలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు భరత్. కాలేజీ బస్ లో కూర్చొని ఉండగా తన సీనియర్ ఒకడు వచ్చి “తమ్ముడు మీ క్లాస్ లో ఎవడో యాక్టర్ ఉన్నాడు అంట కదా వస్తే చెప్పు మాట్లాడతా ” అని అన్నాడట. అది నేనే అన్నయ్య అని చెప్పిన కానీ అతను నమ్మలేదట ఎందుకంటే భరత్ అప్పటికే బాగా సన్నబడిపోయాడు అంట భరత్.



























