అవికాగోర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది చిన్నారి పెళ్లికూతురు సీరియల్. అప్పట్లో సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎంతో క్యూట్ గా నటించిన అవికాగోర్ మెల్లగా తన అడుగులను వెండితెర వైపు వేసి అక్కడ కూడా తన నటన ద్వారా ఎంతో మందిని ఆకర్షించింది. హిందీ లో పలు సీరియల్ లో నటించిన అవికాగోర్ ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.

ఉయ్యాల జంపాల సినిమా హిట్ అవడంతో వరుసగా లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ, రాజు గారి గది 3 లో తనదైన శైలిలో ఎంతో అద్భుతంగా నటించారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు ఎంతో బొద్దుగా, లాగా ఉన్న అవికా గోర్ సినిమాలకు దూరంగా ఉండి తన శరీరంపై కాస్త శ్రద్ద పెట్టింది. ఎంతో వర్క్ ఔట్ చేసి తన శరీరాకృతిని మార్చుకుని ఇప్పుడు ఎంతో నాజూకుగా, అందంగా కనిపిస్తుంది. అయితే తాను మళ్లీ మామూలు మనిషిగా మారడానికి కారణం తన ప్రియుడేనంటూ ఆమె చెప్పుకొచ్చింది. అతనితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నానని స్పష్టం చేసింది.































