మార్తాండ్ కే వెంకటేశ్.. తెలుగు సినిమా చరిత్రలో ఆయనకు కొన్ని పేజీలు ఉంటాయి. ఎందుకంటే.. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు ఆయన ఎడిటింగ్ చేశారు. ఏ సినిమాకైనా సరే.. ఎడిటింగ్ చేయాలంటే ఆయన తర్వాతనే ఇంకెవరైనా. ఆయన ఎడిటింగ్ అలా ఉంటుంది. ప్రేక్షకుల నాడిని తెలుసుకొని.. ఏ సీన్ అయితే ప్రేక్షకులు చూస్తారు.. ఏ సీన్ ను చూడరు. ఏది వాళ్లకు బోర్ కొడుతుంది. ఏ సీన్ లెన్త్ ఎంతుండాలి.. ఇలాంటి లెక్కలన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. అందుకే.. ఆయన ఒక్కసారి ఎడిటింగ్ చేశారంటే.. ఇక ఆ సినిమా ఎడిటింగ్ విషయంలో ఎవ్వరూ వేలు పెట్టాల్సిన అవసరం ఉండదు. అంత పక్కాగా, పర్ ఫెక్ట్ గా ఆయన ఎడిటింగ్ ఉంటుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మార్తాండ్ కే వెంకటేశ్.. జూనియర్ ఎన్టీఆర్.. ఆంధ్రావాలా సినిమా ప్లాఫ్ అవుతుందని ముందే పూరీ జగన్నాథ్ కు చెప్పారట. సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడే.. ఆ సినిమా ప్లాఫ్ అవుతుందా? హిట్ అవుతుందా? ఆయనకు తెలిసిపోతుందట. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? కాదు.. ఓవర్ ఆల్ గా సినిమా మొత్తం బాగుందా? బాగలేదా? అనేదే ప్రేక్షకులకు కావాలి. అందుకే.. ఆంధ్రావాలా.. ప్లాఫ్ అని నేను ముందే పూరీ జగన్నాథ్ కు చెప్పాను.. అని షాకింగ్ నిజాలను మార్తాండ్ కే వెంకటేశ్ బయటపెట్టారు.
నేను ఎడిట్ చేసిన మొదటి సినిమా అల్లరి ప్రేమికుడు

నేను ఎడిటర్ గా ఎడిట్ చేసిన మొదటి సినిమా అల్లరి ప్రేమికుడు. ఆ సినిమాకు నాకు రాఘవేంద్రరావు పిలిచి చాన్స్ ఇచ్చాడు. కూలీ నెంబర్ వన్ సినిమాకు ఆయన సినిమాకు అసిస్టెంట్ గా ఉన్నాను. ఆ సినిమా గురించి నీ అభిప్రాయం చెప్పు అని రాఘవేంద్రరావు నన్ను అడిగితే.. సినిమా బాగుంది కానీ.. హీరో క్యారెక్టరైజేషన్ బాగలేదు సార్ అన్నా. దీంతో ఆయన గుర్తు పెట్టుకొని.. ఆయన తర్వాత సినిమా అల్లరి ప్రేమికుడిలో ఎడిటర్ గా చాన్స్ ఇచ్చారు. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నవు.. అలాగే ఉండు నువ్వు అని చెప్పాడు. అలా.. వరుసగా నాకు పెళ్లి సందడి, సాహస వీరుడు సాగర కన్య లో అవకాశాలు వచ్చాయి.. అని మార్తాండ్ కే వెంకటేశ్ చెప్పారు.
ఆంధ్రావాలాలో ఎన్టీఆర్ గెటప్ నాకు నచ్చలేదు

అసలు.. ఆంధ్రావాలా సినిమాలో నాకు ఎన్టీఆర్ గెటప్ అస్సలు నచ్చలేదు. అందుకే.. ఆ సినిమా ఎందుకో ఆడదు అని నేను డైరెక్ట్ గా పూరీకి చెప్పాను. మరి ఏమైనా కామెడీ ట్రాక్స్ యాడ్ చేద్దామా? అని పూరీ అడగారు కానీ.. కుదరదు.. సెట్ అవ్వదని డైరెక్ట్ గా చెప్పేశా.. అని మార్తాండ్ చెప్పారు. అలాగే.. సూపర్ సినిమా కూడా ఆడదని చెప్పా. సూపర్ సినిమాలో నాగార్జున హెయిర్ స్టయిల్ కూడా నాకు నచ్చలేదు. అందుకే.. ఆ సినిమా కూడా ఆడదని చెప్పా. అదే జరిగింది. ఆ సినిమా కూడా ఆడలేదు. అదేంటి.. 3 లక్షల రూపాయల బైక్ పెట్టి.. ఎన్నో స్టంట్స్ చేశాం.. సినిమా ఆడదని అంటున్నావు అంటే.. అది మూడు లక్షల బైక్ అయినా.. 30 లక్షల బైక్ అయినా.. హీరో హెల్మెట్ పెట్టుకొని చేసే సాహసాలు ఎవరు చూస్తారు. అందరికీ అది మూడు లక్షల బైక్ అని తెలియదు.. కదా అని పూరీకి డైరెక్ట్ గా చెప్పేశా.. అని వెంకటేశ్ తన మనసులో మాటను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.


































