కేంద్ర కేబినెట్ విస్తరణకు కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సైతం రాజీనామా చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆరోగ్యశాఖ విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి.

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సరైన రీతిలో స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారతీయ ఆరోగ్య వ్యవస్థపై పెను భారం పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక కేబినెట్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గాంగ్వర్, సహాయ మంత్రులు రావ్ సాహెబ్ ధాన్వే పాటిల్, విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ దోత్రేలు ఉన్నారు.


































