హీరో మాధవన్ కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అయితే తండ్రి మూవీ రంగంలో రాణిస్తే.. కొడుకు క్రీడా రంగంలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. రీసెంట్ గా మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొని కాంస్య పతకాన్ని సాధించాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకున్నారు మాధవన్. ఈ సందర్భంగా తన కొడుకు వేదాంత్ ఇండియా తరపున మెడల్ సాధించినందుకు తనకు, తన భార్యకు గర్వంగా ఉందని చెప్పారు మాధవన్.

సఖి’ ‘అమృత’ ‘చెలి’వంటి మూవీ లతో మాధవన్ తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నాగ చైతన్య, చందూ మొండేటిల ‘సవ్యసాచి’ మూవీలో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. నటుడిగా కెరీర్ ఆరంభించిన ఇరవై యేళ్లకు మాధవన్ ఒక తెలుగు మూవీలో నటించబోతుండటం విశేషం.



























