మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. 60ఏళ్ళు పైబడినప్పటికీ, అదే ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాలలోకి వెళ్ళిన కారణంగా పదేళ్ళ పాటు సినిమాలకి దూరంగా ఉన్నారు. అయితే ఆయన, మెగా హీరోలతో పాటు మిగతా హీరోల సినిమాలకి చీఫ్ గెస్ట్‌గా హాజరయిన ప్రతీసారి మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆయన రీ ఎంట్రీ గురించి అడిగారు. అలా అడిగిన ప్రతీసారి అభిమానులకి ఉత్సాహాన్నిస్తూ వచ్చారు తప్ప చాలా ఏళ్ళు సినిమా రీ ఎంట్రీ మీద ఓ నిర్ణయం తీసుకోలేదు. అయితే అప్పుడప్పుడు తనయుడు రాం చరణ్ నటించిన సినిమాలలో తళుక్కున మెరిశారు.

మగధీర, బ్రూస్‌లీ సినిమాలలో మెగాస్టార్ అలా కొద్దిసేపు వెండితెరమీద కనిపించారో లేదో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అదీ మెగాస్టార్ క్రేజ్. ఈ సినిమాలు చూసిన అభిమానులు ఆగలేకపోయారు. దాంతో మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా ఫంక్షన్ అయినా, ప్రమోషన్ అయినా చివరికి వచ్చిన టాపిక్ మాత్రం మెగాస్టార్ రీ ఎంట్రీ. ఈ ఒత్తిడి తట్టుకోలేక మెగాస్టార్ కూడా మళ్ళీ రీ ఎంట్రీ గురించి ఆలోచన మొదలు పెట్టారు. 149 సినిమాలు చేసిన మెగాస్టార్ ఆ ఒక్క సినిమా ‘150’ని పూర్తి చేసి ఇక సినిమాలు ఆపేయాలనుకున్నారు.

అదే సమయంలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.. నాన్న రీ ఎంట్రీ ఇస్తే ఆయన సినిమాని నేనే నిర్మిస్తాను అని పబ్లిక్ గా ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ని నిలబెట్టుకుంటూ తండ్రి కోసం ఇంటిపేరు మీద కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. గ్రాండ్ గా రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 నిర్మించారు. పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా అదే వాడి అదే వేడి అని తన డాన్స్‌తో, పర్ఫార్మెన్స్‌తో, ఫైట్స్‌తో నిరూపించారు. అంతేకాదు ఆ తర్వాత కూడా వరుసగా యంగ్ డైరెక్టర్స్‌కి అవకాశాలిస్తూ క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయ్యారు. ఇప్పటికే ఆచార్య పూర్తి చేశారు మెగాస్టార్.

అయితే మెగాస్టార్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో ఆ మధ్య వినిపించింది. ఆయనకి ఉన్న అపారమైన అనుభవంతో మెగా ఫోన్ పట్టుకొని కెప్టన్ కుర్చీలో కూర్చోవడం పెద్ద పనేం కాదు. ఇక ఇలా అనుకోవడానికి కూడా కారణం గతంలో మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా. బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంచలన విజయాన్ని అందుకొని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ చాలా మందికి తెలియదని చిత్ర వర్గాలలో చెప్పుకుంటారు. అదేమిటంటే ఈ సినిమాకి కీలకమైన క్లైమాక్స్ సీన్స్ ని మెగాస్టార్ డైరెక్ట్ చేశారట.

ఆ సమయంలో బాలకృష్ణతో కూడా బి.గోపాల్ సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలు ఒకేసారి షెడ్యూల్ కావడంతో కొన్ని ఇబ్బందుకు వచ్చాయట. అప్పటికే ఇంద్ర సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో షూటింగ్ ఆపే పరిస్థితి లేక మెగాస్టార్ క్లైమాస్ సీన్స్ తెరకెక్కించారని చెప్పుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు చూసిన అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే మెగాస్టార్ ఓ సినిమాకి పూర్తి స్థాయిలో దర్శకుడిగా మారితే చూడాలని ఇండస్ట్రీ వర్గాలలో చాలా మంది భావిస్తున్నారు. ఇక అభిమానులకి, మెగా ఫ్యామిలీకైతే ఆ ఉత్సాహం రెట్టింపు స్థాయిలో ఉంది. చూడాలి మరి అన్నయ్య మెగాస్టార్ స్టార్. మెగా ఫోన్ ఎప్పుడు పట్టుకుంటారో..



























