కంగనా రనౌత్.. హీరోయిన్ అనేకంటే ఆమెకు వేరే బిరుదులూ చాలానే ఉన్నాయి.. కేరాఫ్ కాంట్రవర్సీ, ఫైర్ బ్రాండ్ అంటూ ఇలా ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ లో వివాదాలకు కేంద్ర బిందువు అయినా కంగనా రనౌత్ ఇటీవలే చేసిన హంగామా అంత ఇంతా కాదు. పొలిటికల్ సర్కిల్ లో కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.. ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అవతలి వారికి కోపం తెప్పిస్తుంది.. మరి ఆమె కావాలని టార్గెట్ చేస్తుందో మరీ తెలియక చేస్తుందో తెలీదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

ఆమె నోటిదూలవల్ల ఆమెపై ముంబై లోని రాజకీయ వర్గాలు కూడా విపరీతమైన ఆరోపణలు చేసింది.. అక్కడి మున్సిపాలిటీ కూడా ఆమె ఆఫీస్ భవనాన్ని కూల్చివేసింది.. సుశాంత్ సూసైడ్ తో మొదలైన ఆమె పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇదిలా ఉంటే కంగనా ఇంత ఎదగడానికి ఆమె ఎంత కృషి చేసి ఉంటుంది? ఆమె చేసే పనులు ఎలా ఉంటాయి? హోమ్ వర్క్ సంగతేంటి? ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకంటే ఆమె సెలక్ట్ చేసుకుంటున్న సినిమాలు కూడా చిన్నా చితకా సబ్జెక్టులు కాదు.
ప్రతి సినిమాకీ కచ్చితంగా ఎంతో కొంత హోమ్ వర్క్ తప్పనిసరి. మరి అలాంటి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆమె ఏం చేయాలి? ఎలా చేస్తారు? గత సినిమాల సంగతి ఏమోగానీ…. పాలిటిక్స్ లో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న అమ్మ జయలలిత బయోపిక్ కోసం కంగన చేసిన ఎక్సర్‌సైజ్ ఎలాంటిది? ఆమె ఏమేం నేర్చకున్నారు? అనే పిక్స్ చూస్తేనే అసలు విషయం అర్థమైపోతుంది.



























