1980 దశకం వరకు మనం అనేకమంది ప్రతి కథానాయకులను చూశాం…కానీ ఈయన విలనిజం ఓ ప్రత్యేకం. ఎస్వీ రంగారావు, శత్రుఘ్న సిన్హా లాంటి మహా మహుల హావభావాలను పరిశీలించి, అభిమానించి తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకుని రొమాంటిక్ విలన్ గా తెలుగు సినీ పరిశ్రమలో స్థిరపడిపోయారు.ఆయన ఎవరో కాదు మనందరికీ తెలిసిన ‘మగమహారాజు’ సినిమా లో నటించిన బాలాజీ, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా నటించాడు. తనదైన శైలిలో ప్రేక్షకులందరినీ అలరించాడు. అందుకే ఆయన సినీ ప్రయాణంలో ‘మగమహారాజు’ ఓ మైలురాయి గా పేర్కొనవచ్చు.

ఆంధ్రా యూనివర్సిటీలో నట శిక్షణ పూర్తవగానే దర్శకరత్న దాసరి నారాయణరావు తీయబోయే ‘ఓ ఆడది ఓ మగాడు’ చిత్రానికిగాను నూతన నటీనటులు కావాలని ప్రకటన వచ్చింది. అప్పుడు బాలాజీ మద్రాస్ వెళ్లి దాసరి నారాయణరావు,కోడి రామకృష్ణ,రవిరాజా పినిశెట్టి లాంటి దర్శక దిగ్గజాల ముందు ఆ సినిమాకు గాను ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది.100 మందిని ఇంటర్వ్యూ చేస్తే అందులో బాలాజీ ఎంపిక కావడం జరిగింది. అలా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఓ ఆడది ఓ మగాడు చిత్రం లో మొదటగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత దర్శకనిర్మాత విజయబాపినీడు తీయబోయే మగమహారాజు చిత్రానికిగాను బాలాజీ ని ఎంపిక చేయడానికి విజయబాపినీడు చాలా సమయం తీసుకొని చివరికి ఆ చిత్రంలోని ఓ వేషానికి సెలెక్ట్ చేశారు.

అలా చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి మళ్లీ దర్శకరత్న దాసరి దర్శకత్వంలో ఎమ్మెల్యే ఏడుకొండలు, మంగమ్మగారి మనవడు, మహానగరంలో మాయగాడు లాంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 1987లో ఘర్షణ ఫేం కార్తీక్ హీరోగా రుద్రుడు అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా పరాజయం పొందడంతో సినిమా అవకాశాలు చాలా తగ్గాయి. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించాడు. అయితే బాలాజీ అక్కగారు ఎవరో కాదు.. బాహుబలి లో ప్రభాస్ కు, రంగస్థలంలో రామ్ చరణ్ కి రోహిణి తల్లిగా నటించింది. రోహిణి తెలుగు సినిమాల్లోని అనేక మంది హీరోయిన్స్ కి వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పారు. పసివాడి ప్రాణం, రుద్రనేత్ర, శివ, ఒకే ఒక్కడు, సుస్వాగతం, అజాద్,మాస్ లాంటి చిత్రాల్లో నటించిన రఘువరన్ రోహిణిని 1996 లో పెళ్లి చేసుకున్నారు. అక్కా బావ లైన ఈ ఇద్దరిని బాలాజీ ఎంతగానో ఇష్టపడతాడు. అయితే బాలాజీ బావగారు అయిన రఘువరన్ అనారోగ్య కారణాల వలన 2008లో మరణించారు.































