మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపద్యంలో చిత్ర పరిశ్రమలో రోజు రోజుకు ఎన్నికల హడావిడి వేడెక్కుతుంది. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సి ఉండగా.. 3 నెలల ముందే పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, నటి హేమ ప్రకటించారు.

తాజాగా మా ప్రెసిడెంట్‌గా బరిలోకి దిగుతున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నాన్ లోకల్ అన్న వారిపై ద్వజమెత్తారు. అయితే తాను రెండు గ్రామాలను దత్తత తెసుకుని సేవలు అందించినప్పుడు తనను నాన్ లోకల్ అని ఎవరూ ప్రశ్నించలేదని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. తాను గడిచిన 20 సంవత్సరాలుగా తెలుగు పరిశ్రమలోనే ఉన్నాను.. అంతేకాదు నా ఆధార్‌కు కూడా హైదరాబాద్ చిరునామాతోనే ఉంది. అసలు తానూ ఎలా నాన్ లోకల్ అవుతానని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కళాకారులు లోకల్ కాదు.. యూనివర్సల్. మా ప్యానల్ సభ్యులంతా సర్వస్వతంత్రులు.. వారు ఎవరినైనా ప్రశ్నిస్తారు’’ అన్నారు. సినీ పరిశ్రమ ఎంతో సున్నితమైందని. ఇక్కడ నేను పదవుల కోసం పోటీ చేయడం లేదు అన్నారు ప్రకాశ్‌రాజ్.



































