సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటకూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి వివరాలను చూస్తే.. మెదక్ జిల్లా సంగాయిపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్(40) వారి కూమారుడు కుమారుడు వివేక్(6) కాగా మిగితా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. వివేక్(6) అనారోగ్యానికి గురి కావడంతో అతని తల్లిదండ్రులు చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతదేహాలను శవపరీక్ష కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుల్కల్ ఎస్సై నాగలక్ష్మితో పాటు ఇతర పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గోన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఘటనా స్థలాని పరిశీలించారు.



























