“96” తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లు గా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా “జానూ” చిత్ర యూనిట్ ఒక వినూత్న ఫోటో కాంటెస్టు పెట్టింది. #MyClickForJaanu అని ట్విట్టర్ వేదికగా నెటిజన్ల నుంచి ఫోటోలు ఆహ్వానిస్తుంది. మంచి ఫోటోలు పంపినవారికి శర్వానంద్, సమంత లతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని తెలిపింది.
ఇప్పటికే వేలాది ఫోటోలు వచ్చాయని చిత్ర యూనిట్ తెలిపింది. “జాను” కోసం చక్కని ఫోటోలు పంపుతున్న వారి పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జనవరి 31 వ తేదీ చివరిరోజు అని గడువు తేదీ ముగిసేలోపు మరిన్ని ఫోటోలు పంపాలని కోరింది సమంత. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా వచ్చేనెలలో ప్రారంభం కానుంది.
We are overwhelmed by the thousands of beautiful images you've all sent on #MyClickForJaanu! Keep them coming… Last day for entries is January 31st!#Sharwanand @Samanthaprabhu2 @SVC_Official @premkumar1710 @Govind_Vasantha @CinemaInMyGenes #Jaanu https://t.co/8CWDlr83vK
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2020



























