తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న హీరోలు ఎవరో మనందరికీ తెలిసిన విషయమే.. సీనియర్ హీరోలని పక్కనపెడితే ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు మొదటి సినిమా సమయంలో ఎలా ఉన్నారో.. ప్రస్తుతం వాళ్ళు చేసిన సినిమాల ప్రకారం ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఎందుకంటే మొదటి సినిమాలో చాలా మంది హీరోలు బక్కపలచగా ఉంటూ సినిమాలు చేశారు. అప్పుడప్పుడే కొత్త కాబట్టి సినిమా ఇండస్ట్రీకి అలవాటు పడటానికి కొంచెం మొదట్లో కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత వాళ్లకు నటన గాని సినిమా ఇండస్ట్రీ లో ఉండే హిట్స్ ఫ్లాప్స్ అన్ని అలవాటైపోయిన తర్వాత వాళ్లు తీసుకునే నిర్ణయాలు సినిమాల మీదే కాకుండా వాళ్ళ బాడీ మీద కూడా చూపిస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు ఎలా ఉండాలి అనేది వాళ్లకు వాళ్లే మేకోవర్ అవుతూ ఉంటారు. దర్శకుడు ఎలా చెబితే అలా అవడమే వాళ్లు చేసే పని అని చాలా మంది హీరోలు ఓపెన్ గా కూడా చెప్పారు. అలాగే ఈ ఆరుగురు హీరోలు మొదటి సినిమాలో వాళ్ళు ఎలా ఉన్నారో ప్రస్తుతం ఎలా ఉన్నారో ఒక్కసారి మనం తెలుసుకుందాం…
పవన్ కళ్యాణ్

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాకపోయినా పవన్ కళ్యాణ్ కు హీరోగా మంచి పేరే వచ్చింది. కానీ ఆ సినిమాలో ఆయన చేసిన జిమ్నాస్టిక్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి అని అందరూ మెచ్చుకున్నారు. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా బక్కగా ఉండేవాడు. కానీ తర్వాత తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తే తన బాడీని మేకోవర్ చేసుకుంటూ వచ్చినట్టుగా తెలుస్తుంది. గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో ఒక సినిమాలో ఒక రకం గా కనిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు జనాలని కూడా విపరీతంగా అలరిస్తూ ఉన్నారు…
మహేష్ బాబు

రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాలో యంగ్ గా బాగా లేత గా కనిపించారు. కానీ ఆ తర్వాత తర్వాత వచ్చిన సినిమాల్లో తనకు తాను మార్పులు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా పోకిరి సినిమాలో మాస్ డైలాగులతో జనాలు అందరిని అలరించారానే చెప్పాలి. ఆ సినిమా నుంచే మహేష్ బాబుకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. మహేష్ బాబు రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో కూడా చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కార్ వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా అద్భుతంగా ఉన్నారని చెప్పాలి.
ప్రభాస్

ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినప్పటికీ ప్రభాస్ కి హీరోగా మంచి పేరే వచ్చింది. కానీ ప్రభాస్ మొదట్లో బక్కగా ఉండి డైలాగులు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ తర్వాత తర్వాత దాన్ని అధిగమించి డైలాగ్స్ చెప్పే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా చత్రపతి లాంటి సినిమాలో తను చెప్పిన డైలాగ్స్ వల్లే సినిమా అంత బాగా ఆడింది అంటే అతిశయోక్తి కాదు. బాహుబలి లాంటి సినిమాలో తన బాడీ ఎలా ఉంటుందో మనం అందరం చూశాం బక్కగా ఉండే ప్రభాస్ బలం గా తయారయ్యారు. అలా సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో ఒక స్టేజ్ లో ఒకలా మారుతుంటారు అనడానికి ప్రభాస్ ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు…
జూనియర్ ఎన్టీఆర్

‘నిన్ను చూడాలని’ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే మొదట్లో ఎన్టీఆర్ లుక్స్ పరంగా కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి సినిమాల్లో మాస్ హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. అయినప్పటికీ అశోక్, రాఖి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ బాగా లావుగా కనిపించే వారు. దాంతో సర్జరీ చేయించుకొని బక్కగా తయారయ్యారు. ప్రస్తుతం టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ తనని తాను చాలా మేకోవర్ చేసుకున్నారనే చెప్పాలి. అతని ఫస్ట్ సినిమా కి అరవింద సమేత వీర రాఘవ సినిమా కి ఎన్టీఆర్ ని చూస్తే.. అప్పుడు అలా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఇంతలా ఎలా మారిపోయాడు అని మనకి డౌట్ వస్తుంది…
రామ్ చరణ్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమాలో బాడీ బిల్డ్ చేసి బలంగా కనిపించారు. తర్వాత తర్వాత వస్తున్న సినిమాల్లో కూడా రాంచరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకోవడం కోసం చాలా కష్టపడుతూ వచ్చారు. ముఖ్యంగా ధ్రువ సినిమాలో అయితే బాడీని టైట్ గా మార్చేసి అందరినీ అలరించారు. అలాగే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా అల్లూరి సీతారామరాజు గెటప్ లో బలం గా కనిపిస్తున్నారు చరణ్.
అల్లు అర్జున్

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఆ సినిమా చూసిన అందరూ అసలు అల్లు అర్జున్ హీరోలా లేడు అసలు ఆయనది హీరో ఫేసే కాదు అని చాలా కామెంట్లు చేశారు. అయినా కూడా అల్లు అర్జున్ అవేమి పట్టించుకోకుండా కష్టపడుతూ సినిమాలు చేసుకుంటూ హీరోగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అనే బిరుదును కూడా సంపాదించుకున్నారు. అలా వైకుంఠ పురంలో సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూ ఎవరైతే మొదటి సినిమాలో తనను విమర్శించారో వాళ్ల చేతే శభాష్ అనిపించుకున్నారు.






























