ప్రతి బిడ్డ ఎదుగుదలలో ‘నాన్న’ పాత్ర అత్యంత కీలకం. నేనున్నాను అంటూ నాన్న ఇచ్చే భరోసా ముందు ఏది ప్రపంచంలో మిగిలినవన్నీ తక్కువే.. అయితే కొందరి జీవితంలో నాన్న ప్రేమను పొందే అదృష్టం ఉండదు. అందువల్ల నాన్న జ్ఞాపకాలు గుండెల్లో దాచుకుంటూ బరువెక్కిన హృదయాలతో గడుపుతుంటారు.. సరిగ్గా ఇలానే తన తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ అయింది సురేఖావాణి కూతురు సుప్రిత.

సుప్రిత..సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే తాజాగా తన తండ్రి సురేష్ తేజ తో ఉన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ”ఐ లవ్ యూ నాన్న.. సరిగ్గా రెండేళ్ల క్రితం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫొటో ఇది. నిజానికి అప్పుడు తెలియదు అదే నువ్వు నాతొ సెలెబ్రేట్ చేసుకునే ఆఖరి ఫాదర్స్ డే అని.. నా కోసం తిరిగి రా నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే” అంటూ తీవ్ర భావోద్వేగం చెందింది. గతంలో కూడా చాలాసార్లు తన తండ్రి సురేష్ తేజపై ఉన్న ప్రేమను ఆమె బయటపెట్టింది.

సుప్రిత త్వరలోనే సినీరంగ ప్రవేశం కోసం సురేఖా వాణి రంగం సిద్దం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పలు విడియోలతో తల్లి, కూతుళ్ళు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి చేసిన వీడియోస్ వైరల్ అయ్యాయి కూడా. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంటుంది సుప్రిత.



























