తిరుమల వెంకన్న స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ మరియూ కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో శ్రీవారి దర్శనానికి జనాల తాకిడి పెరుగుతుంది. ఈ నేపధ్యంలో నిన్న సుమారు 18,211 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 7,227 మంది భక్తులు వారి యొక్క తలనీలాలను స్వామివారికి సమర్పించారు. ఈ క్రమంలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.09 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

ఈ నేపధ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. తిరమల కొండపై కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.



























