సింగర్ కల్పన.. ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని సంగీత ప్రేమికులు ఉండరు. కొన్ని వందల్లో పాటలు పాడుతూ అలరించిన గాయని కల్పన. కేవలం సింగర్ గా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. బాలనటిగా నటిగా కూడా రాణించారు కల్పన. ఇక బాలనటిగా సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. తాజగా ఓక టీవీ షోలో తన జీవితంలో తానూ ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చారు. ఈ నేపద్యంలో గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడారు.

ఈ క్రమంలో ఆమే మాట్లాడుతూ.. కల్పన తండ్రి, మరియూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇద్దరూ కలిసి ఒకే కళాశాలలో చదువుకున్నారట. ఆ విధంగా వారిద్దరికీ ఎప్పటినుంచో పరిచయం ఉందట. ఇక ఆ సమయంలో కల్పన తండ్రి మ్యూజిక్ బ్యాండ్ లు ఏర్పాటు చేస్తుండేవారట.. అందులో బాలుగారు కూడా పాటలు పాడేవారట. ఆ విధంగా నిన్ననాటి నుండి బాలుగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కల్పన.
ఇక డబ్బింగ్ చెప్పడం అత్యంత కష్టమైనా పని అని కల్పన అన్నారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వడం, ఏడవడం, గట్టిగా అరవడం వంటివి చేయాలి. అందువల్ల డబ్బింగ్ చెప్పడం మానేసాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక 2010 సంవత్సరం కల్పన ఎన్నడూ లేనన్ని గడ్డుపరిస్థితులను ఎదుకున్నారట. ఆ సమయంలో అప్పటి వరకూ సంపాదించినదంతా కోల్పోవడంతో మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఇక అదే సమయంలో చనిపోదాం అనేంత కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారట. ఆ పరిస్థితుల్లో సింగర్ చిత్ర మద్దతుగా నిలిచి ఏంతో సహాయం చేసారట.
ఈ క్రమంలో మలయాళం లో ఒక షోలో పాల్గొనమని సింగర్ చిత్ర సలహా ఇచ్చారట. అప్పుడు ఆ షోలో పాల్గొన్న తానూ పట్టుదలతో టైటిల్ గెలిచానని చెప్పారు కల్పన. అయితే ఒక ప్లే బ్యాక్ సింగర్ అయి ఉండి నువ్వు కాంపిటేషన్స్ లో పోటీ చేయడం ఏంటి అంటూ చాలా మంది విమర్శించారట. కల్పన వల్ల పరిశ్రమ పరువు పోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలియజేశారు. ఇక త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న కల్పన ఓ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారట.































