తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న తెలంగాణ డేటా సెంటర్‌లో యూపీఎస్‌ను ఆధునేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆన్లైన్ సేవలు నిలిపి వేయడం జరిగింది. ఇందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి కూడా అంతరాయం ఏర్పడింది.

అయితే సాంకేతిక కారణాల వలన నేడు, రేపు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. కాగా.. సోమవారం నుంచి యధావిధిగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.































