అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోయిన్స్ తెలుగు కాకుండా హిందీ నుంచి, అలాగే ఇతర భాషల నుంచి హీరోయిన్స్ ని తీసుకురావడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఇది డైరెక్టర్స్ దాకా పాకినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే మనోళ్ళకి మన డైరెక్టర్లంటే అంతగా నమ్మకం లేనట్టు కనిపిస్తుంది. టాలీవూడ్ లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వంటి నలుగురైదుగురు మినహా పెద్దగా హిట్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరనే చెప్పాలి.

ఇక అందుకే హిట్ కోసం పరభాషా డైరెక్టర్లను మన స్టార్ హీరోలు ఎంచుకుంటున్నారా అనిపిస్తుంది. అంతేకాదు.. మన వాళ్ళను పాన్ ఇండియా డైరెక్టర్స్ గా మార్చడానికి బదులు పరభాషా డైరెక్టర్స్ తో పాన్ ఇండియా మూవీస్ గా మార్చుకోవాలని చూడడం విమర్శలకు దారితీస్తుంది. ఇక జక్కన్నతో ఆర్ ఆర్ ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మూవీకి ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తుంది. ప్రశాంత్ కెజిఎఫ్ 2 తర్వాత తారక్ ని డైరెక్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

కాగా.. కన్నడ హీరోలను వదిలిపెట్టి తెలుగు హీరోలను డైరెక్ట్ చేయడం ఏమిటని కన్నడిగులు ఇప్పటికే ప్రశాంత్ ని హెచ్చరించారని అప్పట్లో టాక్ ఉంది. అంతేకాక.. విజయ్ కి వరుస హిట్స్ ఇస్తున్న అట్లీ అనే డైరెక్టర్ పై తారక్ కన్ను పడినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తో ఓ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. మరోవైపు పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట తర్వాత ఓ అరవ డైరెక్టర్ తో పనిచేస్తాడని టాక్ వినిపిస్తుంది.

అయితే ఖైదీతో హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ బాగా నచ్చడంతో మహేష్ అటువైపు మొగ్గుతున్నాడని ఇండస్ట్రీలో ప్రముఖులు అంటున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీ నిర్మించబోతోందని సమాచారం. అయితే టాలెంట్ కోసం పక్క రాష్ట్రాల డైరెక్టర్స్ పై మన హీరోలు లుక్ వేయడం చర్చకు తావిస్తునట్లు తెలుస్తుంది. అంతేకాక.. తమిళ, కన్నడ, హిందీ డైరెక్టర్లను పెట్టుకుంటే పాన్ ఇండియా మూవీగా మారుతుందని, కాసుల వర్షం కురిపిస్తుందని మనోళ్లు భావిస్తున్నట్లు సంమాచారం.



























