‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’.. ఈ మధ్యనే అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ దూసుకుపోతుంది. అయితే, సమంత తొలిసారిగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ వెబ్ సిరీస్ తోనే.. అయితే ఈ వెబ్ సీరీస్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.

ముఖ్యంగా ఇందులో సమంత తమిళ అతివాదిగా నటించడం చాలా మందికి నచ్చలేదు. అలాగే ఇందులో సమంత కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా చేసిందట. నిజానికి ఈ విషయంలో కొందరు ఆశ్చర్యానికి లోనయ్యారు.

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సీరీస్ లో హీరోయిన్ సమంతాతో పాటు నటించిన సహనటుడు షాహబ్ అలీ తాజాగా కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. సమంత – షాహాబ్ మధ్య కథలో భాగంగా కొన్ని ఇంటమేట్ సీన్స్ ఉన్నాయట. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిపే విధంగా కొన్ని శృంగార సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే, చిత్రం నిడివి ఎక్కువ ఉండటంతో వీరిద్దరూ నటించిన బెడ్ రూమ్ సీన్స్ కు కత్తెర వేసారట. ఆ సీన్స్ అవసరం లేదని భావించి చివరి నిమిషంలో పక్కకు పెట్టేసారట.



























