ఆయన సినిమాల్లోని ఏ పాత్రకైనా ఇట్టే ఒదిగిపోతారు. ఆయన వేసే పాత్ర ఏదైనా తనదైన నటన శైలిని కనబరుస్తారు. అత్యంత సహజం గా నటించే నటీనటుల్లో సాక్షి రంగారావు ఒకరు. నటించే తీరు చూస్తుంటే పాత్ర తప్ప ఆయన అందులో కనిపించరు. గుడివాడ లో పుట్టి పెరిగిన సాక్షి రంగారావు ఉన్నత చదువు పూర్తి చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ లో స్టెనోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. అలా ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేస్తూ ఉండే వాడు.

అలా నాటకాలు వేస్తున్న సమయంలో తన ఆప్త మిత్రులు, బంధువులు సినిమాల్లో నటించమని కోరారు. అలా సాక్షి రంగారావు 1967లో బాపు దర్శకత్వంలో లో కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన సాక్షి సినిమాలో రంగారావు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత సుడిగుండాలు, 1980 లో వచ్చిన శంకరాభరణం లో సోమయాజులు గాన కచేరి లో తబలిస్టుగా కనిపించారు. ఆ తర్వాత శుభలేఖ, సప్తపది, సాగరసంగమం, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వరాభిషేకం, సూత్రధారులు, స్వాతి కిరణం, చంటబ్బాయి, ఘరానా మొగుడు, యమలీల లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.

నాలుగు దశాబ్దాల కాలంలో దాదాపు ఐదు వందల సినిమాల్లో ఆయన వివిధ రకాలైన పాత్రలను వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2005లో చెన్నైలో గురజాడ రాసిన కన్యాశుల్కం అనే నాటకాన్ని రిహార్సల్ చేస్తుండగా హఠాత్తుగా రంగారావు ప్రాణాలు వదిలారు. అంతకుముందే ఆయనకు డయాబెటిస్, కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి.

అయితేసాక్షి రంగారావు కు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాక్షి రంగారావుకు కూతురు వరలక్ష్మి అంటే చాలా ఇష్టం. రామశివయ్య, శివరామయ్య ఇద్దరు కొడుకులు వారు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించాలని ఎప్పుడూ కోరుకునేవారు. అయితే బుల్లితెరపై సాక్షి రంగారావు కొడుకు సాక్షి శివ, అసలు పేరు వెంకటశివరామయ్య.. బాపు గారి అనుమతి లేకుండా శివ పేరు ముందు సాక్షి అని ఎలా పెట్టుకుంటావని తన కొడుకుతో బాపు వద్దకు వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు సాక్షి రంగారావు అడిగారు. దర్శకుడు బాపు గారు నవ్వి…. పరవాలేదు అని చెప్పడంతో సాక్షి రంగారావు సంతోషపడ్డారు.

అయితే సాక్షి రంగారావు కొడుకు శివను వంకాయల సత్యనారాయణ మొదటగా సినిమాల్లోకి రావాలని కోరడం జరిగింది. అలాగే నర్రా వెంకటేశ్వరరావు కూడా సాక్షి శివ కు ఎంతగానో తోడ్పడ్డారు. సాక్షి శివ తమిళ, తెలుగు టీవీ సీరియల్ లో ఎక్కువగా నటించారు. ఈ మధ్యకాలంలో మా టివి లో ప్రసారమైన మౌన రాగం అనే సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించారు. Covid-19 మొదటి వేవ్ లో సాక్షి శివకు కరోణ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే హోమ్ ఐసోలేషన్ అనంతరం నెగిటివ్ రావడంతో తిరిగి ఆయన సీరియల్స్ లో బిజీ అయ్యారు.

































