మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘స్వయంవరం’ సినిమాతో రచయితగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాకి ఆయన రాసిన మాటలు బాగా పేలాయి. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమాలోకి రావాలనుకున్న ఆయన.. నటుడు గౌతంరాజుకు పిల్లలకు ట్యూషన్స్ చెప్తూ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో పంజాగుట్టలోని సాయి బాబా ఆలయం దగ్గర్లో స్నేహితుడు, హాస్యనటుడు సునీల్ ఒకే గదిలో ఉండేవారు. ఆ సమయంలో ఒక వారపత్రికలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన “ది రోడ్” అనే కథ వచ్చి ప్రశంసలు అందుకుంది.

అలా ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత అయిన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. 1999లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం చిత్రానికి రచయితగా అవకాశం వచ్చింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అలా నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలన్నీ ఆయనకి స్టార్ రైటర్ గా చాలా మంచి పేరు తీసుకు వచ్చాయి.ఈ క్రమంలో యంగ్ హీరో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా మారినప్పటికి రచయితగా వాసు, మన్మథుడు, ఒక రాజు ఒక రాణి, మల్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు స్క్రీన్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్‌గా చేశారు.

నువ్వే నువ్వే చిత్రం తర్వాత దర్శకుడిగా త్రివిక్రమ్ కి మూడేళ్ళ గ్యాప్ వచ్చింది. రెండవ సినిమా గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీశాడు. అదే “అతడు”. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి నటుడు, నిర్మాత మురళీ మోహన్ నిర్మించారు. అయితే ఈ కథ త్రివిక్రమ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నాడు. దాదాపు ఆరు నెలలు ఆయనకి కథ చెప్పడానికి ప్రయత్నాలు చేసి చివరికి ఓ రోజు కలిసి కథ చెప్పారు. ఈ కథ వింటూ పవన్ కళ్యాణ్ నిద్రపోయారట. ఎలాగోలా కథ పూర్తయ్యాక ఇన్‌డైరెక్ట్‌గా మనం మళ్ళీ కలుద్దామని పవన్ వెళ్ళిపోయాడట.

మళీ ఆయన నుంచి త్రివిక్రమ్ కి కాల్ రాలేదు. ఇదే కథను కొన్ని మార్పులు చేసి మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే మార్చి అతడుగా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఆయన నటించిన ఓ సినిమా ఫ్లాపయి మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ కారణంగానే త్రివిక్రమ్ చెప్పిన కథను సరిగ్గా వినలేదు. ఇక త్రివిక్రమ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తుందా లేదా అని కొంత బాధపడ్డాడని చెప్పుకొచ్చారు. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సూపర్ హిట్ అవడంతో పాటు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడేలా చేసింది. దాంతో ఇద్దరు మంచి స్నేహితులుగా సాగుతున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి సినిమాలొచ్చాయి.

































