భారత్‌లో 19,230 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం ద్వారా తమ సిబ్బందిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. క్లయింట్ల నుంచి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా భారత్ వెలుపల 1,941 మందిని తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.

‘2022 కల్లా అమెరికాలో 25,000 మందిని నియమించుకుంటాం. అదనంగా 12,000 కొత్త ఉద్యోగాలివ్వడం ద్వారా అమెరికా నియామకాలను విస్తరిస్తున్నామ’ని తెలిపారు. కెనడాలోనూ 2023 కల్లా సిబ్బందిని రెండింతలు చేసి 4,000కు చేరుస్తాం. బ్రిటన్‌లో 1,000 డిజిటల్ ఉద్యోగాల సృష్టికి ఆలోచిస్తున్నామని’ నందన్ వివరించారు.



























