సినీ క్రిటిక్ , నటుడు కత్తి మహేష్ ఈనెల 26న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఐసీయూ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యం పై ఇప్పటివరకు ప్రజలకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు మొదలయ్యాయి.

కత్తి మహేష్ ఆరోగ్యం విషమించిందని, వైద్యులు సైతం ఏమి చేయలేమని తేల్చిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కత్తి మహేష్ ఆరోగ్యం పై వస్తున్నా వార్తలపై అతని స్నేహితుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసారు. అందులో అయన మాట్లాడుతూ.. కత్తి మహేష్ ఆరోగ్యంపై ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదు. అయితే కన్నుకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేసారు అని తెలిపారు. ఇక కత్తి మహేష్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నాయి. అవన్నీ వాస్తవం కాదు. వాటిని ఎవరూ నమ్మవద్దని, అయన వైద్యానికి బాగానే స్పందిస్తున్నాడు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ నేపద్యంలో మహేష్ ను అభిమానించే వాళ్ళు, అలాగే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
































