కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ బుధవారం సాయంత్రం 6 గంటలకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం.

అయితే కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఎక్కువ అవకాశాలున్న వారు ఢిల్లీకి చేరుకుంటున్నారు.


































