పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ ఇది మన అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని విధంగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాన్. అయన రాజకీయాలలో బిజీగా ఉండి దాదాపు మూడు సంవత్సరాలు ఎటువంటి సినిమాలు చేయలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. తాజా “వకీల్ సాబ్” సినిమాతో ఆ విషయం అర్ధం అవుతుంది. ఇక పవన్ కు సంబంధించిన వార్తలు అన్నీ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ట్రేండింగ్ లోనే ఉంటాయి.

అయితే శాండిల్ వుడ్ లో మరో పవర్ స్టార్ ఉన్నారు ఆయనే హీరో పునీత్ రాజ్ కుమార్. అక్కడి ప్రేక్షకులు ఆయనను పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే ఇటీవల పునీత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. అసలు తనని “పవర్ స్టార్” అని పిలవద్దని, అసలు ఆ బిరుదుకి న్యాయం చేసే హీరో కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారంటూ అయన పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో కూడా నాకు దయచేసి ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ పెట్టొద్దు అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్బంగా పునీత్ రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మన దేశంలో ఆ బిరుదుకు సరైన అయిన వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే.. అంటూ పునీత్ రాజ్ కుమార్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.



























