ఇంటర్నెట్ లో అస్లీల వెబ్ సైట్లను నిలిపివేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కోరారు. పోర్న్ సైట్లను బ్యాన్ చేయాలని, ఇంటర్నెట్ లో ఉన్న అర్థరహిత సమాచారాన్ని తొలగించాలని నీతీశ్ డిమాండ్ చేసారు. ఈ పోర్న్ సైట్ల వల్లే మహిళల పట్ల నేరాలు అధికంగా జరుగుతూన్నాయని నితీష్ అభిప్రాయపడ్డారు.
నితీష్ రాసిన ఈలేఖ కి ప్రజలనుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ పోర్న్ సైట్లు కంట్రోల్ చేస్తే ఆడవారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు తగ్గుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అయితే మద్యం, గుట్కాలు, పాన్ పరాగ్, సిగరెట్లు కూడా నిషేదించాలని, పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని, పొగాకు పండించే రైతులకు వేరే ఆహార లేదా వాణిజ్య పంటలు పండించేలా ప్రభుతం ప్రోత్సహించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమయినా బీహార్ సీఎం నితీష్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుంది.



























