అద్భుత నటనా చాతుర్యం, ఆశ్చర్య పోయే సంభాషణా చాతుర్యం ఇవి రెండూ కలిస్తే ప్రకాశ్రాజ్. ఆయన అభినయం ఆకాశం, దక్షిణాది చిత్రాల్లో ఆయన ఓ సూర్య ప్రకాశం. సినీ విలీనాకాశంలో విలక్షణ నటనతో సూర్యకాంతిల విస్తరించి జాతీయ అవార్డులను సైతం కొల్లగొడుతూ.. తన నటనతో బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నారు. కర్ణాటకలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ప్రకాష్ రాజ్. పెరిగి పెద్దయిన తర్వాత నాటకాలలో నటించారు. తర్వాత టీవీ రంగంలోకి వెళ్ళాడు. ప్రముఖ నటి గీత, ప్రకాష్ రాజ్ నటన చూసి ఆశ్చర్యపోయింది.

ఒకసారి ప్రముఖ దర్శకుడు బాలచందర్ ని కలవమని అపాయింట్మెంట్ కూడా ఇప్పించారు. ప్రకాష్ రాజ్ బాలచందర్ ను కలవడంతో ఆయన తమిళ చిత్రం “డ్యూయెట్” చిత్రంలో ఒక వేషం ఇచ్చారు. అలా చిత్ర రంగంలోకి అడుగు పెట్టిన ప్రకాష్ రాజ్. తెలుగులో (1995) సూర్య మూవీస్ బ్యానర్, ఎ.ఎం రత్నం దర్శకత్వంలో జగపతిబాబు, గౌతమి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో ప్రకాష్ రాజు కూడా ఒక వేషం ధరించారు. స్వస్థలం బెంగళూరు కావడంతో తెలుగు డబ్బింగ్ చెప్పడంలో చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తమిళ చిత్రాలను చూసిన ఎస్.వి కృష్ణారెడ్డి “గన్ షాట్” చిత్రంలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.

1998లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన “అంతఃపురం” చిత్రంలో ప్రకాష్ రాజ్ కరడుకట్టిన ఫ్యాక్షనిస్టు గా నటించాడు. అయితే ఇందులో తనకంటే వయసులో పెద్దవారైన సాయికుమార్ కి తండ్రిగా నటించాడు. ఆ తర్వాత ఆయనకు కృష్ణవంశీ మళ్లీ “ఖడ్గం” సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. 2001లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు చిత్రంలో ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి తండ్రిగా నటించాడు. అదేవిధంగా 2005లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన “అందరివాడు” చిత్రంలో చిరంజీవికి మామగా నటించారు. 2013లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో వెంకటేష్ కు తండ్రిగా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ఆయనకు మామగా నటించాడు.

ఇకపోతే ప్రకాష్ రాజ్ తనకంటే వయసులో పెద్దవారైన ప్రముఖ నటి జయసుధకు అనేక చిత్రాల్లో భర్తగా నటించడం జరిగింది. అంతపురం, సుస్వాగతం, బద్రి, ఖడ్గం, ఇడియట్, పోకిరి, బొమ్మరిల్లు లాంటి చిత్రాల్లో ప్రకాష్ రాజు నటన “నభూతో నభవిష్యత్” అనే విధంగా ఉంటుంది. ఆయన నటనకు గాను దాదాపు ఐదు నేషనల్ అవార్డ్స్, ఆరు నంది అవార్డ్స్ తీసుకున్నారు. అతని ప్రవర్తనతో తెలుగు నిర్మాత మండలిచే బహిష్కరింపబడి తిరిగి “గోవిందుడు అందరివాడేలే” చిత్రంతో తిరిగి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు.


































