సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా తన ఖాతాదారులకు గట్టి షాక్ ఇచ్చింది. మన దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సుమాకు 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్‌పై వేటు వేసింది. దేశీయంగా ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తన తొలి నెలవారీ కంప్లయిన్స్ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

ఈ క్రమంలో జూలై 15న తమ తదుపరి నివేదికను ప్రచురిస్తామని పేర్కొంది. ఆ నివేదికలో ఫేస్‌బుక్ వినియోగదారులు చేసిన ఫిర్యాదులు, వాటికి అనుగుణంగా ఫేస్‌బుక్ తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలుంటాయని పేర్కొంది. ఇక ఐటీ నిబంధనల ప్రకారం మన దేశంలో మే 15-జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులపై చర్య తీసుకున్నట్టు వెల్లడించింది.































